20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 12 బంతుల్లోనే ఫలితం.. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో విధ్వంసం..

T20 Match: టీ20 మ్యాచ్‌ల్లో ఎన్ని లక్ష్యచేధనలను చూశారు.? కేవలం 12 బంతుల్లోనే టార్గెట్‌ను ఛేజ్ చేయడం మీరెప్పుడైనా చూశారా.? బహుశా చూసి ఉండకపోవచ్చు..

20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 12 బంతుల్లోనే ఫలితం.. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో విధ్వంసం..
Zimbabwe
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 11, 2021 | 7:34 PM

టీ20 మ్యాచ్‌ల్లో ఎన్ని లక్ష్యచేధనలను చూశారు.? కేవలం 12 బంతుల్లోనే టార్గెట్‌ను ఛేజ్ చేయడం మీరెప్పుడైనా చూశారా.? బహుశా చూసి ఉండకపోవచ్చు. కానీ జింబాబ్వే టీం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. మొదట బంతితో.. ఆ తర్వాత బ్యాట్‌తో విధ్వంసం సృష్టించింది. ఈ మ్యాచ్ మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో జరిగింది. తాజాగా, జింబాబ్వే, ఈశ్వతిని జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో.. జింబాబ్వే 10 వికెట్లతో 108 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేధించింది.

స్వాజిలాండ్ అని పిలువబడే ఈశ్వతిని జట్టు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లకు కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ టీం 10 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. ఈశ్వతిని జట్టు 9.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్‌గా వెనుదిరిగారు. అత్యధిక స్కోరర్ 6 పరుగులు చేయగా.. ఎక్స్‌ట్రాల ద్వారా అదనపు పరుగులు వచ్చాయి.

జింబాబ్వే బౌలర్లు విధ్వంసం సృష్టించారు..

జింబాబ్వే బౌలర్లు ఈశ్వతిని బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించారు. బోఫానా 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 6 వికెట్లు తీయగా, ఫిరి 1.2 ఓవర్లలో కేవలం 1 పరుగు ఇచ్చి 3 వికెట్లు తీశారు. అటు సిబండా 1 వికెట్ పడగొట్టింది. బోఫానా తన అద్భుత బౌలింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు అందుకుంది.

12 బంతుల్లో ఫలితం వచ్చేసింది..

18 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే కేవలం 12 బంతుల్లో దాన్ని పూర్తి చేసింది. అంటే, 2 ఓవర్లలో 20 ఓవర్ల లక్ష్యాన్ని ముగించింది. ఈ విజయంతో జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు గ్రూప్ Aలో రెండవ స్థానంలో నిలిచింది. 2 మ్యాచ్‌లలో 2 విజయాలతో 4 పాయింట్లు గెలుచుకుంది.

Also Read:

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!