Viral Video: సింహం వేట మాములుగా లేదు.. క్షణాల్లో చిరుతను వేటాడి చంపేసింది.. వీడియో చూస్తే షాకే!

Lion Viral Video: జంతువు ఏదైనా కూడా అడవిలో మనుగుడ సాగించాలంటే వేటాడక తప్పదు. క్రూర జంతువుల నుంచి సాధు జంతువుల వరకు వారి జీవనాధారం..

Viral Video: సింహం వేట మాములుగా లేదు.. క్షణాల్లో చిరుతను వేటాడి చంపేసింది.. వీడియో చూస్తే షాకే!
Lion
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 11, 2021 | 7:34 PM

జంతువు ఏదైనా కూడా అడవిలో మనుగుడ సాగించాలంటే వేటాడక తప్పదు. క్రూర జంతువుల నుంచి సాధు జంతువుల వరకు వారి జీవనాధారం వేటపై ఆధారపడి ఉంటుంది. సింహం, పులి, చిరుత లాంటి జంతువుల వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటి పంజా పవర్‌కు నిదర్శనంగా నిలిచే ఎన్నో వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వైల్డ్ లైఫ్ వీడియోలపై ఆసక్తి ఉన్నవారు జంతువుల వేటకు సంబంధించిన దృశ్యాలను తెగ ఇష్టపడతారు. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

అడవి రారాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. అల్లంత దూరంలో సింహం కనిపిస్తే చాలు.. మిగతా జంతువులు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు పెడతాయి. ఇక సింహం వేట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి జంతువునైనా క్షణాల్లో మట్టుబెట్టి.. వెంటాడి.. వేటాడేస్తుంది. తాజాగా సింహం ఓ చిరుతను వేటాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ చిరుత ఎంచక్కా చక్కటి ప్రదేశాన్ని ఎంచుకుని సేద తీరుతున్నట్లు మీరు చూడవచ్చు. అయితే దాన్ని దూరం నుంచి ఓ సింహం గమనిస్తుంది. అది మళ్లీ తప్పించుకోకుండా ఉండటానికి వేగంగా పరుగెత్తి.. తన పదునైన పళ్లతో మట్టుబెడుతుంది. సరిగ్గా చిరుత మెడను తన పదునైనా పళ్లతో పట్టుకుని.. పంజాతో అదెక్కడికి వెళ్లకుండా సింహం ఆపుతుంది. ఈలోపే అక్కడికి మరో సింహం చేరుకుంటుంది. ఇంకేముంది చిరుత ప్రాణాలు పోయినట్లేనని చెప్పొచ్చు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

ఈ షాకింగ్ వీడియోను ‘Big Cat Namibia’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీన్ని ఇప్పటిదాకా 69,683 మంది వీక్షకులు వీక్షించారు. ‘ఫాస్టెస్ట్ యానిమల్‌కి ఏమైందంటూ” చిరుతపై సానుభూతి తెలుపుతూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేయగా.. ”ఇందుకే సింహాన్ని అడవికి రారాజు’ అని అంటారంటూ మరికొందరు పోస్ట్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై లుక్కేయండి.

Also Read:

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం