Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏమన్నారంటే.!

Sai Dharam Tej Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్‌ను అపోలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి.

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏమన్నారంటే.!
Sai Dharam Tej
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 11, 2021 | 7:33 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్‌ను అపోలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. అంతర్గత గాయాలు ఏమి లేవని డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రధాన అవయవాలు బాగానే పని చేస్తున్నాయని అపోలో వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. అటు ఇంటర్నల్ బ్లీడింగ్ లాంటిది ఏమిలేదన్న వైద్యులు.. చికిత్సకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తున్నారని తెలిపారు. డాక్టర్ అలోక్ రంజన్ పర్యవేక్షణలో సాయి ధరమ్ తేజ్‌కు చికిత్స నిర్వహిస్తున్నామన్నారు. కాలర్ బోన్ ఫ్యాక్చర్ సంబంధించి 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని అపోలో వైద్యులు అన్నారు.

కాగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గత రాత్రి మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్‏ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి చేర్పించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు.

Also Read:

Apollo

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం