AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF, NPS నుంచి డబ్బు విత్‌ డ్రా చేస్తున్నారా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..

EPF, NPS Money Withdraw: EPF, NPS అనేవి భవిష్యత్‌లో మనకు డబ్బు అందించే పథకాలు. పిల్లల విద్య లేదా వివాహం కోసం ఈ రెండు పథకాలు పెద్ద పాత్ర పోషిస్తాయి.

EPF, NPS నుంచి డబ్బు విత్‌ డ్రా చేస్తున్నారా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..
uppula Raju
|

Updated on: Sep 11, 2021 | 7:16 PM

Share

EPF, NPS Money Withdraw: EPF, NPS అనేవి భవిష్యత్‌లో మనకు డబ్బు అందించే పథకాలు. పిల్లల విద్య లేదా వివాహం కోసం ఈ రెండు పథకాలు పెద్ద పాత్ర పోషిస్తాయి. అయితే ఇందుకోసం చాలా కాలంపాటు మనం డబ్బు పొదుపు చేయవలసి ఉంటుంది. మీరు EPF, NPS నుంచి అత్యవసరంగా డబ్బు విత్‌ డ్రా చేయవచ్చు. కానీ దీనివల్ల మీరు చాలా ప్రయోజనాలను కోల్పోవలసి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

అత్యవసర పరిస్థితులలో మాత్రమే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అత్యవసర పరిస్థితులలో మాత్రమే పిఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవాలి. లేదంటే అస్సలు విత్‌ డ్రా చేయకూడదు. మీరు వివాహం లేదా ఇల్లు నిర్మించడానికి PF డబ్బును ఉపసంహరించుకుంటే అంతకంటే పెద్ద విపత్తు వచ్చినప్పుడు మీకు సమయానికి చేతిలో డబ్బు ఉండదు. మీరు తెలివిగా పెట్టుబడి పెడితే మీ PF డబ్బు ప్రతి 8 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. కానీ మీరు పెట్టుబడికి బదులుగా ఆ డబ్బును ఉపసంహరించుకోవడం ప్రారంభిస్తే సేవింగ్స్ అనేదానికి అర్థం ఉండదు.

వడ్డీ ప్రయోజనాన్ని పొందలేరు పిఎఫ్ డబ్బును రెట్టింపు చేయడాన్ని మిశ్రమ వడ్డీ అంటారు. మీరు డబ్బు విత్‌డ్రా చేస్తే మీరు కాంపౌండింగ్ సౌకర్యాన్ని కోల్పోతారు. మీరు PF డబ్బును విత్‌డ్రా చేయకపోతే రిటైర్‌మెంట్‌లో ఖచ్చితంగా చేతిలో చాలా డబ్బు ఉంటుంది. తద్వారా మిగిలిన జీవితం గౌరవంగా జీవిస్తారు. అయితే PF డబ్బు విత్‌డ్రా చేసేటప్పుడు మీకు రెండు ఆప్షన్‌లు ఉంటాయి. ఆ డబ్బును మళ్లీ డిపాజిట్ చేయడం లేదా శాశ్వతంగా తీసుకోవడం.

NPS ఉపసంహరణ నష్టం మీరు అత్యవసర పరిస్థితుల్లో NPA డబ్బును విత్‌డ్రా చేస్తే ఒకేసారి అనేక రకాల సౌకర్యాలను కోల్పోతారు. కావాలంటే మీరు NPS లో 20% లంప్సమ్‌ను ఉపసంహరించుకోవచ్చు కానీ దానికి పన్ను చెల్లించాలి. మిగిలిన 80 శాతం యాన్యుటీ ప్లాన్‌లో తప్పనిసరిగా డిపాజిట్ చేయాలి. ఈ డబ్బు ఆధారంగా మీరు తర్వాత పెన్షన్ పొందుతారు. మీరు NPS డబ్బును విత్‌డ్రా చేయకపోతే మెచ్యూరిటీపై 60 శాతం డబ్బు పొందాలనే నియమం ఉంది.

Sai Dharam tej: తేజు మీదనే కాదు.. మున్సిపాలిటీపై, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై కూడా కేసుపెట్టమంటున్న మ్యూజిక్ డైరెక్టర్

Viral Photos: అమెజాన్‌ అడవిలో కనిపించే 5 ప్రమాదకరమైన పాములు! కాటు వేశాయంటే అంతే సంగతులు

Chinta Mohan: దీపావళి పండుగ లోపు ఏపీకి కొత్త ముఖ్యమంత్రి : కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు