Yamaha Festive Offers: పండుగ ఆఫర్లను ప్రకటించిన యమహా.. ఏ స్కూటర్లపై ఎంత పర్సంటేజంటే..?
Yamaha Festive Offers: ద్విచక్ర వాహన సంస్థలు సెప్టెంబర్‌లో పండుగ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. స్కూటర్లు, బైక్‌లపై తగ్గింపు ధరలను వెల్లడిస్తున్నాయి. తాజాగా జపాన్
Yamaha Festive Offers: ద్విచక్ర వాహన సంస్థలు సెప్టెంబర్‌లో పండుగ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. స్కూటర్లు, బైక్‌లపై తగ్గింపు ధరలను వెల్లడిస్తున్నాయి. తాజాగా జపాన్ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్ ఇండియా స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2021 వరకు చెల్లుబాటు అవుతుంది. యమహా ఇటీవలే ఫాసినో 125 ఫై, రేజెడ్ఆర్ 125 ఫై హైబ్రిడ్ వెర్షన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తమిళనాడులో మాత్రం ఆఫర్లు భిన్నంగా ఉంటాయి.
Yamaha Fascino 125 Fi : యమహా ఈ మోడల్‌పై రూ.3,876 వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కల్పిస్తోంది. రూ.999 డౌన్‌పేమెంట్‌తో స్కూటర్‌ను తీసుకోవచ్చు. వీటితో పాటు స్క్రాచ్ కార్డ్ అండ్ విన్ పోటీలో కనీసం రూ.2,999 బహుమతిగా గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ కంటెస్ట్‌లో గరిష్ఠంగా బంపర్ ప్రైజ్ కింద రూ.1,00,000 వరకు పొందవచ్చు. తమిళనాడులో మాత్రం గరిష్ఠ బహుమతి లేదు.
Yamaha Ray ZR 125 Fi: ఈ మోడల్ హైబ్రిడ్, నాన్-హైబ్రిడ్ అనే మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. నాన్-హైబ్రిడ్ వేరియంట్‌పై ఫాసినో 125 ఎఫ్‌ఐకి వర్తించే ప్రయోజనాలే లభిస్తాయి.
Yamaha Fascino 125 Fi Hybrid: ఈ మోడల్‌ను కొనుగోలు చేసేవారికి రూ.5,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. లేదా రూ.999 డౌన్‌పేమెంట్ చెల్లించి స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు. రూ.6,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. స్క్రాచ్ అండ్ విన్ కింద రూ.2,999-రూ.1,00,000 వరకు బంపర్ ఆఫర్ అందిస్తున్నారు.