AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: తన లుక్​పై దృష్టిపెట్టి సరికొత్తగా కనిపించనున్న ప్రభాస్.. సీక్రెట్‌గా చికిత్స కోసం యూకేకి పయనం?…

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినీ కెరీర్ ను బాహుబలికి ముందు తర్వాత అని చెప్పుకోవచ్చు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దక్షిణాదిలో కూడా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ..

Prabhas: తన లుక్​పై దృష్టిపెట్టి సరికొత్తగా కనిపించనున్న ప్రభాస్.. సీక్రెట్‌గా చికిత్స కోసం యూకేకి పయనం?...
Prabhas
Surya Kala
|

Updated on: Sep 11, 2021 | 3:24 PM

Share

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినీ కెరీర్ ను బాహుబలికి ముందు తర్వాత అని చెప్పుకోవచ్చు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దక్షిణాదిలో కూడా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇక ప్రభాస్ ఫిజిక్ కూడా బాలీవుడ్ హీరోల పోటీ వచ్చేలా  ఉండడంతో అమ్మాయిల కలల హీరో అయ్యాడు. సాహు సినిమా తర్వాత వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ భారత సినీ చరిత్రలో ఏ హీరోకు దక్కని ఫాలోయింగ్ అటు సోషల్ మీడియాలోను.. ఇటు సినీ ఇండస్ట్రీలోను సొంతం చేసుకొన్నాడు. ప్రస్తుతం ఊపిరి తీసుకొని విధంగా షెడ్యూల్తో బిజీగా ఉన్నాడు.  ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా.. సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు.. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా సెట్స్ మీద ఉంది.

అయితే గత కొంత కాలంగా ప్రభాస్  శరీరంలో ఇటీవల కొన్ని మార్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతన్నాయట.  ప్రభాస్ ఫిట్ నెట్ పై కోల్పోయాడనే విషయం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. అయితే తనలోపాలను సరిద్దిద్దుకొనేందుకు ప్రభాస్ సిద్దమయ్యారంటూ కొన్ని వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీరాముడి  పాత్ర విషయంలో దర్శకుడు ఓంరౌత్ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లుక్ పరంగా కంటిన్యూటీ మిస్ కాకుండా జాగ్రత్త పడాల్సిందిగా ప్రభాస్ కి సూచించారని తెలిసింది.  అయితే ప్రభాస్ శరీరంలో ఇటీవల కొన్ని మార్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతన్నాయని దీంతో యూకే లో ని వరల్డ్ క్లాస్ డాక్టర్ ..  డైటీషన్ వద్ద ప్రభాస్పం అత్యుత్తమ చికిత్స తీసుకోవడానికి నిర్ణయించుకున్నారని.. ఈ మేరకు ప్రభాస్ సీక్రెట్ గా యుకే పయనమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.

డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాలో రెండు రకాల పాత్రల కోసం.. వాటిలో వేరియేష‌న్స్‌ను చూపించేందుకు… ప్ర‌భాస్ బ‌రువు పెరగడం తగ్గడం వంటి సాహసాలు చేసారు.  అంతేకాదు సాహు మూవీకోసం మళ్ళీ స్లిమ్ గా మారాల్సి వచ్చింది. ఇక యాక్షన్ సీన్ల కోసం మళ్ళీ భారీ దేహధారుడ్యానికి మారాల్సి వచ్చింది. దీంతో ప్రభాస్ డైట్ లో విపరీతమైన మార్పులు వచ్చాయని అందుకే ఇప్పుడు ప్రభాస్ కు శరీర తీరు మారిందని అంటున్నారు.  ఇక ప్రభాస్ 25వ సినిమా గురించి ఆసక్తికర విషయం రివీలైంది. 2023లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడట.

Also Read: Sai Dharam Tej in ICU: ఐసీయూలో తేజు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న జూ. ఎన్టీఆర్ , విజయ్ దేవరకొండ, సినీ నటీనటులు

Follow Us