Oil Prices Down: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. దిగుమతి పన్ను తగ్గించిన కేంద్రం.. దిగి వస్తున్న వంటనూనే ధరలు

Edible Oil Prices down: పండుగల వేళ వినియోగదారులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఆకాశాన్నంటిన వంట నూనె ధరలు దిగివస్తున్నాయి.

Oil Prices Down: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. దిగుమతి పన్ను తగ్గించిన కేంద్రం.. దిగి వస్తున్న వంటనూనే ధరలు
Edible Oils To Down Prices
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 11, 2021 | 10:18 PM

Edible Oil Prices down: పండుగల వేళ వినియోగదారులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఆకాశాన్నంటిన వంట నూనె ధరలు దిగివస్తున్నాయి. దేశవ్యాప్తంగా నాలుగైదు నెలలుగా పేదవాడికి అందనంత ఎత్తుకు ఎదిగి చుక్కలు చూపెట్టిన వంటనూనె ధరలు కొద్దికొద్దిగా తగ్గుతున్నాయి. కరోనా ఎఫెక్ట్​తో ఎన్నడూ లేని విధంగా ధరలు 70 నుంచి 90 శాతం వరకు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి పన్ను తగ్గించడంతో ప్రస్తుతం కిలో ఆయిల్‍ ప్యాకెట్‍పై దాదాపు 15 నుంచి 20 శాతం వరకు రేట్లు తగ్గుముఖం పట్టాయి. ముడి పామాయిల్‌పై ఉన్న 10% దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి, ముడి సోయాబీన్‌ ఆయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై ఉన్న 7.5% సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించారు.

కరోనా టైంలో వంట నూనె రేట్లు డబుల్‍ అయ్యాయి. ఏప్రిల్‍ నెలలో కిలో సన్‍ఫ్లవర్‍ ఆయిల్‍ రూ.90 నుంచి రూ.100 ఉండగా.. ఒక్కసారిగా రూ.180కి చేరింది. ఇదే లెక్కన పామాయిల్‍, సోయా, ఆవనూనె, వేరుశనగ ధరలు సైతం అలానే ఆకాశాన్నంటాయి. దేశంలో నూనె గింజల దిగుబడి తగ్గడానికి తోడు కరోనా ప్రభావమే కారణంగా వ్యాపారులు చెప్పుకొచ్చారు. మామూలుగా మన దేశం మలేషియా, ఇండోనేషియాల నుంచి పామాయిల్‍, బ్రెజిల్‍, రష్యా, అర్జెంటినా వంటి దేశాల నుంచి సన్‍ ఫ్లవర్‍ ఆయిల్‍ను దిగుమతి చేసుకుంటుంది. దేశీయ వంటనూనెల అవసరాల్లో భారత్‌ దాదాపు 60 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా లాక్‍డౌన్‍ అమలు చేయాల్సి రావడం ధరలపై ప్రభావం చూపింది

తాజాగా సామాన్యుడి బాధలపై ఫోకస్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. దేశంలో పెరిగిన వంట నూనెల ధరలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. ఇక అన్ని రకాల రిఫైన్డ్‌ ఆయిల్స్‌ ఉన్న దిగుమతి సుంకాన్ని 37.75% నుంచి 32.5 శాతానికి కుదించారు. తాజా తగ్గింపు నేపథ్యంలో ముడి నూనెలపై దిగుమతి సుంకంతో కలుపుకొని మొత్తం పన్నులు 24.75 శాతానికి తగ్గనున్నాయి. ఇక దీంతో రిఫైన్డ్‌ ఆయిల్స్‌పై ఉన్న పన్ను 35.75 శాతానికి చేరనున్నాయి.

కాగా, ఓ వైపు దిగుమతి పన్ను తగ్గించడానికి తోడు దేశంలో నూనె గింజల సాగు పెంచడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తోంది కేంద్ర సర్కార్. దీంతో నూనె ధరలు మరింత తగ్గే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.

Read Also…  Coroanvirus: అక్కడ పాఠ్యాంశంగా ‘కరోనా వైరస్’.. తొలుత 11వ తరగతి సిలబస్‌లో చేర్చిన విద్యాశాఖ..!