Viral Photos: అమెజాన్ అడవిలో కనిపించే 5 ప్రమాదకరమైన పాములు! కాటు వేశాయంటే అంతే సంగతులు
Viral Photos: ఈ ప్రపంచంలో విషపూరిత జీవులు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి పాములు. ఈ రోజు అమెజాన్ డేంజర్ పాముల గురించి తెలుసుకుందాం.
Updated on: Sep 11, 2021 | 7:07 PM

ఐలాష్ వైపర్స్: ఈ పాములు చాలా అందంగా కనిపిస్తాయి. అడవులలోని చెట్ల కొమ్మలు, తీగలపై కూర్చుంటాయి. వీటి దాడిలో ఇప్పటివరకు చాలా మంది మరణించారు.

ఉష్ణమండల పాములు : అమెజాన్‌లో అత్యంత ప్రమాదకరమైన పాములలో ఇవి ఒకటి. ఈ పాము కరిస్తే ఒక వ్యక్తి సెకన్లలో చనిపోతాడు. వీటిని దక్షిణ అమెరికన్ రాటిల్‌నేక్స్ అని పిలుస్తారు.

బుష్‌మాస్టర్ పాము: ఇది అమెజాన్‌లో అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటి. చాలా విషపూరితమైనవి. ప్రధానంగా దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులలో కనిపిస్తాయి.

ఫారెస్ట్ పిట్ వైపర్: ఈ పాములు అత్యంత ప్రమాదకరమైనవి. కరిచిన తరువాత ఒక వ్యక్తి క్షణంలో మరణించవచ్చు. ఈ ప్రమాదకరమైన పాము అర్బోరియల్ జాతులకు సంబంధించినది.

పగడపు పాము: ఈ పాములు ఎలాపిడ్ పాముల జాతికి చెందినవి. పగడపు పాము విషం బాధితుడి నాడీ వ్యవస్థను చాలా వేగంగా ప్రభావితం చేస్తుంది.



