Chirutha: అనుకున్నట్లుగానే చిక్కింది.. ఫారెస్ట్ అధికారుల ప్లాన్ ఫలించింది.. బోన్‌లో పడిన చిరుతను..
చిరుత ఎట్టకేలకు దొరికింది. అడవి ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా సంచరిస్తున్న చిరుత పులి గ్రామీణ ప్రజలను ఆందోళనకు గురి చేసింది.
మచ్చలపులి గాండ్రిస్తేనే.. వెణ్ణులో వణుకుపుడుతోంది. ఇక ఆకలితో వేటాడటం చూస్తే గుండెలు గుబేల్ మంటాయి. పులులు జనావాసాల్లోకి వస్తేనే.. హడలెత్తి పారిపోతాం.. ఇక అరణ్యంలో చిరుతపులిని చూడాలంటేనే ధైర్యం సరిపోదు. అలాంటి చిరుత అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోన్‌లో చిక్కింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజనతండా శివారులోని వల్లూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత ఎట్టకేలకు దొరికింది. అడవి ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా సంచరిస్తున్న చిరుత పులి గ్రామీణ ప్రజలను ఆందోళనకు గురి చేసింది. అయితే నాలుగుసార్లు చిరుత కనిపించడంతో చుట్టుపక్కల గ్రామస్థులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. తమ పశువులపై ఏ సమయంలోనే దాడి చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వల్లూరు అటవీ ప్రాంతం నెమలిగుట్ట ప్రాంతంలో బోన్‌ను ఏర్పాటు చేశారు. అదే ప్రదేశంలో సంచరిస్తున్న చిరుత కోసం ఓ బోన్ ఏర్పాటు చేశారు. దీంతో శనివారం రాత్రి అటుగా వచ్చిన చిరుతు ఫారెస్ట్ అధికారుల ఏర్పాటు చేసిన బోన్‌లో చిక్కుకున్నది. ఈ విషయమై కామారం గిరిజనతండా వాసులు చిన్నశంకరంపేట పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందజేయడంతో ఎస్సై మహ్మద్ గౌస్, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ చిరుతను ముందుగా జూకు తరలించి.. అక్కడి నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
ఇవి కూడా చదవండి: Weekly Horoscope: ఈ రాశుల వారికి ఈ వారంలో మంచి ఫలితాలు.. వెంటాడుతున్న దీర్ఘకాలిక సమస్య పరిష్కారం