AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: ఈ రాశుల వారికి ఈ వారంలో మంచి ఫలితాలు.. వెంటాడుతున్న దీర్ఘకాలిక సమస్య పరిష్కారం

Weekly Horoscope: ప్రతిరోజూ మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ..

Weekly Horoscope: ఈ రాశుల వారికి ఈ వారంలో మంచి ఫలితాలు.. వెంటాడుతున్న దీర్ఘకాలిక సమస్య పరిష్కారం
Weekly Horoscope
Subhash Goud
|

Updated on: Sep 12, 2021 | 7:22 AM

Share

Weekly Horoscope: ప్రతిరోజూ మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే చాలామంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు జ్యోతిష్యశాస్త్రంపై ఆసక్తి చూపిస్తుంటారు. తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకునేందుకు రాశి ఫలాలను అనుసరిస్తారు. అయితే.. సెప్టెంబర్‌ 12 నుంచి 18వ తేదీ వరకు పలు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషం:

ఈ రాశివారు ఈ వారంలో ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్య నిలకడగా ఉంటుంది.

వృషభం:

అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగంలో ఒత్తిడిలు పెరుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొందరు మిత్రులను నమ్మి నష్టపోయే అవకాశం ఉంది. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మిథునం:

పిల్లల పురోగతి గురించి మంచి సమాచారం అందుకుంటారు. చేపట్టే వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎవరికీ హామీలు, పూచీకత్తులు ఉండకపోవడం మంచిది.

కర్కాటకం:

అదనపు ఆదాయం కోసం అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొత్త వారితో పరిచయాలు పెంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. బంధువుల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.

సింహం:

ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం లభిస్తుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది.

కన్య:

ఇతరులకు ఇచ్చిన బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. పిల్లల్లో ఒకరు దూర ప్రాంతానికి వెళ్లే అవకాశాలుంటాయి. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల:

ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అనవసర ఖర్చులతో కష్టాలు పడతారు. కుటుంబపరంగా బాగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇరుగుపొరుగుతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఎవరినీ నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్పగించవద్దు. కొందరు పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. కొద్దిగా ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

ధనుస్సు:

వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. వీలైనంతగా రుణభారం తగ్గించుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది.

మకరం:

ఉద్యోగ జీవితంలో మంచి పురోగతి కనిపిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలుంటాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మిత్రులు అన్ని విధాలా అండగా నిలుస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితుల ద్వారా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకోవాలి.

కుంభం:

చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. పాజిటివ్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త వింటారు.

మీనం:

ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి ఆదాయం ఉంటుంది. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గతంలో మీ వల్ల సహాయం పొందినవారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Sleep Aid Device: మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా..? ఒత్తిడిని తగ్గించి నిద్రపుచ్చే పరికరం

Fitness Tips: మీరు జిమ్‌కు వెళ్తున్నారా? ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!