MAA Elections 2021: ముదురుతున్న మా వివాదం.. మోహన్ బాబుకు మాత్రమే చెప్తానంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు..

ప్రస్తుతం వరుస వివాదాలు టాలీవుడ్ సినీ పరిశ్రమను ఊపేస్తున్నాయి. ఒకవైపు డ్రగ్స్ కేసులో ప్రముఖులను ఈడీ విచారిస్తుండగా..

MAA Elections 2021: ముదురుతున్న మా వివాదం.. మోహన్ బాబుకు మాత్రమే చెప్తానంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు..
Nagababu
Follow us

|

Updated on: Sep 09, 2021 | 11:45 AM

ప్రస్తుతం వరుస వివాదాలు టాలీవుడ్ సినీ పరిశ్రమను ఊపేస్తున్నాయి. ఒకవైపు డ్రగ్స్ కేసులో ప్రముఖులను ఈడీ విచారిస్తుండగా.. మరోవైపు మా అధ్యక్ష పదవి ఎన్నికలు అగ్గి రాజేస్తున్నాయి. ఇప్పటికే మా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు.. దీంతో మాలో ఉన్న లోసుగులు బయటపడుతున్నాయి. ఇక రోజు రోజుకీ మా ఎన్నికలలో ట్వీస్ట్ కనిపిస్తూ వస్తుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు అనూహ్యంగా తప్పుకోవడం… తెరపైకి మరికొందరి పేర్లు రావడం.. అన్ని పరిస్థితులు సాధారణ రాజకీయ ఎన్నికలుగా రసవత్తరంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోకి జీవితా రాజశేఖర్ ఎంట్రీ.. బండ్ల గణేష్ జౌట్ వంటి సంఘటనలు మరిన్ని సందేహాలను కలిగిస్తున్నాయి. అయితే మా బిల్డింగ్ విషయం ఇప్పుడు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంలో మోహన్ బాబు.. నాగబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

తాజాగా.. మా ఎన్నికల్లో రచ్చగా మారిన బిల్డింగ్ వివాదం ఇప్పుడు మళ్లీ నరేష్ మెడకే చుట్టుకుంటోందా అన్న అనుమానం మొదలైంది. ఎందుకంటే మా మాజీ ప్రెసిడెంట్‌ నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. మొన్నామధ్య జూమ్ మీటింగ్‌లో మోహన్‌బాబు హైలైట్ చేసిన పాయింట్‌కు, ప్రశ్నకు నాగబాబు సూటిగా సమాధానమిచ్చారు.. ! ఆ ఆన్సర్‌తోనే ఇప్పుడు నరేష్‌ చుట్టూ ఉచ్చులా మారినట్లుగా తెలుస్తోంది. మా బిల్డింగ్‌. ఈసారి మా ఎలక్షన్స్‌ ప్రధానమైన అంశం. బరిలో ఉన్న అభ్యర్థులు పూర్తిగా మా బిల్డింగ్ అంశంపైనే స్పందిస్తున్నారు. ఇక మోహన్‌బాబు మా బిల్డింగ్ గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలలో ఎవరిపేరూ చెప్పకపోయినా.. నాగబాబునే అన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే 2006-2008 మధ్య మాకు అధ్యక్షుడిగా ఉన్న నాగబాబు హయాంలోనే బిల్డింగ్‌ని కొన్నారు. అప్పుడు దానికోసం పెట్టిన ఖర్చు.. అక్షరాలా 90లక్షల 46వేలు. కానీ అదే బిల్డింగ్‌ను ఆ తర్వాత దాదాపు 35లక్షలకు అమ్మేశారు. పెట్టిన ఖర్చుకు.. అమ్మిన ఖర్చుకు ఏమాత్రం పొంతన లేదు కాబట్టే మోహన్‌బాబు ఆ మాట అన్నారు. దాన్ని నాగబాబు కూడా తప్పుపట్టడం లేదు. కానీ.. రైట్ క్వశ్చన్‌.. రాంగ్ పర్సన్‌ని అడుగుతున్నారన్నదే నాగబాబు వాదన.

మా అసోసియేషన్ సభ్యులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాను..మేము ప్రకాష్ రాజుకు మద్దతు ఇస్తున్నాం. ఇక్కడ అతని శక్తి సామార్థ్యాల గురించే మాట్లాడాలి. మిగతా అంశాల గురించి మాట్లాడోద్దు. మేము 2006 నుంచి 2008 వరకు బిల్డింగ్‌ను కొన్నాం. అంతకు ముందు నుంచే బిల్డింగ్ సమస్య ఉంది. చాంబర్ వాళ్లు మమ్మల్ని ఖాళీ చేయమని ఒత్తిడి తెచ్చేవారు. అలా అప్పుడు కొత్త బిల్డింగ్ కొనాల్సి వచ్చింది. కానీ ప్రతీ సారి ఎన్నికల్లో మా బిల్డింగ్ కొన్నారు.. అమ్మారు అంటూ కామెంట్లు చేస్తూ వచ్చారు. ఈ విషయంపై ఎవరు మాట్లాడిన స్పందించేవాడినని కాదు.. కానీ మోహన్ బాబు వంటి వారు అడగడంతో చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చారు. బిల్డింగ్ కొన్న సమయంలో అన్ని కలుపుకుని దాదాపు కోటీ ఇరవై, ముప్పై లక్షలు అయ్యాయి. పరుచూరి గోపాల కృష్ణ, సలహ, సూచలనతో శ్రీనగర్ కాలనీలో డైరెక్టర్స్ అండ్ రైటర్స్ అసోసియే,న్ బిల్డింగ్ కు దగ్గర్లో భవనం కొన్నాం. 140స్క్వేర్ యార్డ్స్ స్థలంలో ఉన్న భవనాన్ని 71 లక్షలకు కొన్నాం. ఇంకో మూడు లక్షలతో రిపేర్ చేయించాం. ఇంకో పదిహేను లక్షలతో కొంత రెన్యువేట్ చేయించాం. మొత్తం 96 లక్షలు ఖర్చు అయింది. కానీ 2017లో శివాజీ రాజా అద్యక్షుడిగా నరేష్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు తక్కువ రేటు అమ్మేశారు అంటూ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన కారణాలు కూడా చెప్పారు అంటూ సుదీర్ఘ వివరణ ఇస్తూ వీడియోను షేర్ చేశారు నాగబాబు.. ప్రస్తుతం మెగా బ్రదర్ చేసిన వ్యాఖ్యలు చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

Also Read: Telangana High Court: ఆ వినాయకులకు అక్కడ అనుమతి లేదు.. గణేశ్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు..

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..