AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana High Court: ఆ వినాయకులకు అక్కడ అనుమతి లేదు.. గణేశ్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు..

గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది, హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై ఈసారి ఆంక్షలు విధించింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని సూచించింది.

Telangana High Court: ఆ వినాయకులకు అక్కడ అనుమతి లేదు.. గణేశ్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు..
Telangana High Court
Sanjay Kasula
|

Updated on: Sep 09, 2021 | 1:18 PM

Share

గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది, హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై ఈసారి ఆంక్షలు విధించింది. గణేశ్‌, దుర్గాదేవి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇటీవల సుదీర్ఘంగా విచారణ జరిపింది. దీనిపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు.. తాజాగా గురువారం తీర్పును వెల్లడించింది.ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని సూచించింది. ప్రత్యేక కుంటల్లో విగ్రహాలు నిమజ్జనం చేయాలని హైకోర్టు తెలిపింది. ఈ  ఆంక్షలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశంచింది. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్‌ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని తాజాగా హైకోర్డు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.

ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రబ్బరు డ్యాంలోనే నిమజ్జనం చేయాలని సూచించింది. చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని హైకోర్టు హితవు పలికింది. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి నిమజ్జనం చేయొద్దని.. పీవీ మార్గ్‌, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు రోడ్డు తదితర మిగతా ప్రాంతాల్లో చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది.

హుస్సేన్‌సాగర్‌లో పూర్తిగా కాకుండా ప్రత్యేకంగా రబ్బర్‌ డ్యాం డ్యామ్ ఒకటి ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేయాలని ఆదేశించింది. నిమజ్జనం తర్వాత అక్కడి వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హుస్సేన్‌సాగర్‌ వైపు రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం పూర్తి చేసేలా చూడాలని పేర్కొంది.

ఇవి కూడా చదవండి: Apple Ice Cream : రుచికరమైన యాపిల్ ఐస్ క్రీమ్‌ను ఇంట్లో ప్రయత్నించి చూడండి.. చాలా ఈజీ..

China-taliban: తాలిబన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న డ్రాగన్ కంట్రీ.. భారీగా ఆర్ధిక సహాయం..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..