Air India: ఇకపై హైదరాబాద్ టు లండన్ నాన్‌స్టాప్ విమానాలు.. కొత్త సర్వీసులు ప్రారంభించిన ఎయిర్ ఇండియా.
Air India: హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే విమానాలు మధ్యలో ఆగేవి అయితే తాజాగా...
Air India: హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే విమానాలు మధ్యలో ఆగేవి అయితే తాజాగా ఎయిర్ ఇండియా కొత్తగా నాన్ స్టాప్ విమాన సర్వీలను ప్రారంభించింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమృత్‌సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా నుంచి నేరుగా లండన్ నాన్‌స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఎయిర్ ఇండియా ఈ జాబితాలోకి హైదరాబాద్‌ను కూడా చేర్చింది. అంటే ఇకపై ఎంచక్కా శంషాబాద్‌లో ఫ్లైట్ ఎక్కి నేరుగా లండన్‌లో దిగొచ్చన్నమాట.
ఈ సర్వీసులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లండన్ నుంచి హైదరాబాద్ బయలు దేరిన నాన్‌స్టాప్ విమానం గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. ఈ విమానంలో మొత్తం 256 సీట్లు ఉంటాయి. వీటిటో 18 బిజినెస్ క్లాస్ కాగా, మిగతా 238 సీట్లు ఎకానమి క్లాస్ సీట్లు ఉంటాయి. ఈ సర్వీసుల్లో భాగంగా ప్రతీ సోమ, శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి లండన్‌కు నాన్‌స్టాప్ విమాన సర్వీసులు నడవనున్నాయి. AI 147 విమానం హైదరాబాద్‌లో సోమవారం రాత్రి 1:30 గంటలకు బయల్దేరి, లండన్‌కు అదే రోజు ఉదయం 7:30 గంటలకు చేరుకుంటుంది.
ఇక ప్రతీ శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు బయల్దేరే విమానం అదేరోజు 11:30 గంటలకు లండన్‌కు చేరుకోనుంది. ఇక లండన్ నుంచి AI 148 విమానం ప్రతీ ఆది, గురువారాల్లో హైదరాబాద్‌కు బయలు దేరనుంది. ఈ విమాన సేవలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం www.airindia.in వెబ్‌సైట్ లేదా.. 1860 233 1407 లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది.
Also Read: Tollywood Drugs case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న మాస్ రాజా.. రవితేజ పై కురవనున్న ప్రశ్నల వర్షం
Coronavirus Updates: భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు..