Dr. Reddys: జుట్టు రాలినా నో ప్రాబ్లమ్.. స్త్రీల బట్టతల నివారణకు మెడిసిన్ వచ్చేసింది.. మరి పురుషులకో..

ఆడవాళ్ళల్లో బట్టతలకు అద్భుతమైన మందు మీ ముందుకొచ్చింది. ఇక బట్టతలను మాయం చేసి, ఒత్తైన జుట్టునిచ్చే ఆ డ్రగ్‌ ఏమిటో తెలుసుకుందాం..

Dr. Reddys: జుట్టు రాలినా నో ప్రాబ్లమ్.. స్త్రీల బట్టతల నివారణకు మెడిసిన్ వచ్చేసింది.. మరి పురుషులకో..
Indian Women Hair Loss
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 09, 2021 | 12:03 PM

బట్టతల పేరు వినగానే గుర్తొచ్చేది పురుషులే. కానీ ఈ సమస్య మహిళలకూ పెద్ద తలనొప్పిలా తయారయ్యింది. మహిళల్లో బట్టతలకు పరిష్కారమే లేదా? శతాబ్దాల ఈ ప్రశ్నకు సరికొత్త సమాధానాన్ని వెతికారు వైద్య నిపుణులు. ఇకపై ఆ భయం అక్కర్లేదు. ఆడవాళ్ళల్లో బట్టతలకు అద్భుతమైన మందు మీ ముందుకొచ్చింది. ఇక బట్టతలను మాయం చేసి, ఒత్తైన జుట్టునిచ్చే ఆ డ్రగ్‌ ఏమిటో తెలుసుకుందాం.. బట్టతల అమ్మాయిలకొస్తే అబ్బే అస్సలు బావుండదు.. మగాళ్ళైతే ఏ విగ్గో పెట్టేసి అందగాళ్ళలా మారిపోతారు. కానీ మరి స్త్రీలో.. బట్టతలని ఏ రకంగానూ దాచలేరు. సవాలక్ష సమస్యలతో సతమతమయ్యే స్త్రీల్లో జుట్టు రాలే సమస్య ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్దసవాల్‌గా మారింది.

జుట్టున్న అమ్మ ఏ సిగ వేసినా అందమేనన్నది పాత సామెత. బట్టతలున్నా బెంబేలు పడకుండా భేషుగ్గా బతకొచ్చన్నది ఆధునిక లోకరీతి. స్త్రీల జీవితంలో కేశాలంకరణది ఓ ప్రత్యేక స్థానం. రకరకాల జడలతో.. ముడులతో కేశాలను అందంగా అలంకరించుకోవడం మహిళలందరికీ ఎంతో ఇష్టమైన పని. అందుకే కేశాలంకరణకు మహిళలు ఎంత ప్రాధాన్యతనిస్తారో.. జుట్టుపోషణను కూడా అంతే శ్రద్ధగా పాటిస్తారు.

ఒకప్పుడైతే జుట్టుని ఎంతో అపురూపంగా చూసుకునేవారు. రకరకాల తైలాలు వాడేవారు. కానీ ఆధునిక మహిళలకు అంత సమయం లేదు. అందుకే ప్రతినెలా బడ్జెట్‌లో బ్యూటీపార్లర్లకు డబ్బు కేటాయిస్తున్నారు. ఆధునికంగా కనిపించేందుకు రకరకాల రంగులు వాడుతున్నారు.

జుట్టు రాలడం స్త్రీల్లో అయినా పురుషుల్లో అయినా సర్వసాధారణం. 3 నుంచి 5 ఏళ్ళపాటు జుట్టు పెరుగుతుంది. ఆ తరువాత 100 రోజులు జుట్టు రాలుతుంటుంది. మనం లక్షకుపైగా వెంట్రుకలతో పుడతాం. రోజుకి వంద వెంట్రుకలదాకా రాలుతుంటాయి. అయితే సాధారణంగా రాలే జుట్టుకీ, ఒకేసారి కుచ్చులుగా ఊడే జుట్టుకీ తేడాని గుర్తించొచ్చు.

అయితే ఇకపై జుట్టుబాధ మీకొద్దంటున్నారు వైద్యులు. ఇప్పటి వరకు పురుషుల బట్టతలకు మాత్రమే మందులున్నట్టు భావించేవారు. కానీ స్త్రీల్లో బట్టతల సమస్యనూ అధిగమించొచ్చంటున్నారు వైద్యులు. అందుకు “మినోగ్జిడిల్‌’ ఔషధం అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు. మినోక్సిడిల్‌ ఇప్పుడు కనుగొన్న మందు కాదు. ఎప్పటి నుంచో ఈ డ్రగ్‌ వాడుకలో ఉంది. స్త్రీల్లో బట్టతల నివారణకు ఉద్దేశించిన ఈ డ్రగ్‌ అత్యంత సురక్షితం అని కూడా వైద్యులు చెపుతున్నారు.

“మినోగ్జిడిల్‌’ అనే ఔషధాన్ని మినోటాప్‌ 2 శాతం, మినోటాప్‌ ఎవా 5 శాతం, అనే బ్రాండు పేర్లతో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీన్ని ఎఫ్‌పీహెచ్‌ఎల్‌ మహిళల్లో జుట్టు రాలే సమస్యను నివారించే చికిత్సకోసం సిఫారసు చేస్తున్నారు. మగవారిలో బట్టతల నివారణకు ఈ సొల్యూషన్‌కి అనుమతి ఉంది. అయితే దీన్ని మహిళలకు వినియోగించేందుకు అనుమతివ్వడం ఇదే తొలిసారి.

ఈ డ్రగ్‌ని హృదయ సంబంధిత జబ్బులకీ, రక్తపోటు తగ్గించడానికీ వాడుతున్నారు. దీన్ని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అప్రూవ్‌ కూడా చేసింది. 2 శాతం మినోక్సిడల్‌ ఉపయోగిస్తున్న పురుషుల్లో జుట్టుపెరగడం గుర్తించారు వైద్యనిపుణులు. ఆ తర్వాత నుంచి హెయిర్‌ ట్రీట్మెంట్‌కి దీన్ని వాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు తాజాగా రెడ్డీస్‌ ల్యాబ్‌ మహిళల కోసం కూడా టాపికల్‌ సొల్యూషన్‌ వేరియంట్‌ని కొత్తగా తీసుకొచ్చింది. అయితే దీని వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉంది. కనుక వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి.

ఆడవాళ్ళైనా, మగవాళ్ళకైనా జుట్టు రాలే సమస్యకు అనేక కారణాలున్నాయి. జుట్టుకి వేసుకునే రకరకాల రంగుల్లో ఉండే కెమికల్స్‌ ప్రభావం జుట్టుపై పడటం వల్ల జుట్టు రాలుతుంది. రకరకాల ఒత్తిళ్ళు, మానసిక ఆందోళనలు స్త్రీల్లో అయినా, పురుషుల్లో అయినా జుట్టు రాలే సమస్యకు కారణం. ఈ మందు వాడిన వాళ్ళు మాత్రం జుట్టు రాలే సమస్యకు ఈ డ్రగ్‌ బాగా పనిచేస్తుందంటున్నారు.

ఈ డ్రగ్‌ని అప్లై చేయడం వల్ల న్యూట్రిషన్‌ వ్యాల్యూస్‌ నేరుగా జుట్టుకుదుళ్ళ ద్వారా జుట్టుకి అందుతాయి. తద్వారా త్వరగా జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చునంటున్నారు వైద్యులు. యిదిలా ఉంటే బట్టతలతో భయాందోలనలకు గురికావద్దనీ, బట్టతలతో కుంగిపోకుండా ఉండేందుకు ఏకంగా ఉత్సవాన్నే నిర్వహిస్తున్నారు అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో. బట్టతల శాపం కాదు. అదృష్టం అని చాటిచెపుతున్నారు. అయితే ఈ ఉత్సవంలో పాల్గొనాలని తొందరపడకండి. అక్కడికెళ్ళాలంటే బట్టతల ఉండి తారాల్సిందే.

ఇవి కూడా చదవండి: Apple Ice Cream : రుచికరమైన యాపిల్ ఐస్ క్రీమ్‌ను ఇంట్లో ప్రయత్నించి చూడండి.. చాలా ఈజీ..

China-taliban: తాలిబన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న డ్రాగన్ కంట్రీ.. భారీగా ఆర్ధిక సహాయం..