AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China-taliban: తాలిబన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న డ్రాగన్ కంట్రీ.. భారీగా ఆర్ధిక సహాయం..

ఆ దేశంలో కొత్తగా పాలనలోకి వచ్చిన తాలిబన్లను ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ సర్కార్ ఏర్పడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ దేశానికి భారీ ఆర్థిక...

China-taliban: తాలిబన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న డ్రాగన్ కంట్రీ.. భారీగా ఆర్ధిక సహాయం..
China Financial Support To
Sanjay Kasula
|

Updated on: Sep 09, 2021 | 11:16 AM

Share

అంతా ఊహించినట్లుగానే జరుగుతోంది. అమెరికా సేనలు వైదొలిగిన తరువాత ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందిలావుంటే ముందు నుంచి అన్ని రకాలుగా సహాయం చేస్తున్న దేశాలు రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి చైనా, రెండోది పాకిస్తాన్. సైనిక దాడిలో పాకిస్తాన్ సహాయం చేస్తుంటే.. చైనా మాత్రం వ్యూహం రచిస్తూ తాలిబన్లను ముందుకు నడిస్తోంది. అయితే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా ఆ దేశంలో కొత్తగా పాలనలోకి వచ్చిన తాలిబన్లను ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ సర్కార్ ఏర్పడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ దేశానికి భారీ ఆర్థిక సాయం ప్రకటించింది చైనా. ఆఫ్ఘనిస్తాన్‌కు 31 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 220 కోట్ల రూపాయలు) సహాయాన్ని చైనా బుధవారం ప్రకటించింది. ఆ దేశంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అరాచకాన్ని అంతం చేయడానికి ఇది అవసరమని పేర్కొంది చైనా. అంతే కాదు ఆఫ్ఘనిస్తాన్‌‌లోని ఖనిజ సంపదపై డ్రాగన్ దేశం కన్నేసిందని కొన్ని వారాలుగా వార్తలు వస్తున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌పై పొరుగు దేశాల విదేశాంగ మంత్రుల మొదటి సమావేశంలో పాల్గొన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, ఆఫ్ఘనిస్తాన్ అవసరాలకు అనుగుణంగా 200 మిలియన్ యువాన్ (USD 31 మిలియన్) విలువైన ధాన్యాలు, శీతాకాల సామాగ్రి, టీకాలు, ఔషధాలను అందిస్తుందని వెల్లడించారు. పాకిస్తాన్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఇరాన్, తజికిస్తాన్, తుర్కన్మిస్థాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులు కూడా పాల్గొన్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి నిర్వహించిన సమావేశానికి రష్యా మాత్రం దూరంగా ఉంది.

ఇందులో భాగంగా మొదట విడతలో ఆఫ్ఘన్ ప్రజలకు 3 మిలియన్ వ్యాక్సిన్ మోతాదులను విరాళంగా ఇవ్వాలని చైనా నిర్ణయించిందని వాంగ్ చెప్పారు. చైనా-దక్షిణ ఆసియా దేశాల అత్యవసర సరఫరాల రిజర్వ్‌ల కింద ఆఫ్ఘనిస్థాన్‌కు మరింత అంటువ్యాధి నిరోధక మందులు, అత్యవసర సామగ్రిని అందించడానికి సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది.

ఇవి కూడా చదవడి: బిగ్ బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే.? హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.!