Taliban: అఫ్గాన్ పౌరులకు ఎనలేని కష్టాలు.. తాలిబన్ల చెరలో విమానాలు..!విమానంలో అందరూ వాళ్ళే(వీడియో)
తాలిబన్ల హస్తగతమైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. వీలైనంత త్వరగా పరిస్థితులు అనుకూలంగా మారితే చాలు అని కొందరు అనుకుంటూ ఉండగా..
తాలిబన్ల హస్తగతమైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. వీలైనంత త్వరగా పరిస్థితులు అనుకూలంగా మారితే చాలు అని కొందరు అనుకుంటూ ఉండగా.. మరి కొందరేమో ఆ దేశాన్ని విడిచిపెట్టడానికి కావాల్సిన అన్ని దారులు వెతుకుతూ ఉన్నారు. తాలిబాన్లు మాత్రం దేశం సురక్షితమే.. ఎక్కడికీ వెళ్లొద్దంటూ ప్రజలను కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా విమానాలను కూడా కాబూల్ విమానాశ్రయం నుండి వెళ్లనివ్వడం లేదు.
తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, విదేశాలకు వెళ్తున్న వారిని తాలిబన్లు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైన మజర్–ఏ–షరీఫ్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన దాదాపు నాలుగు చార్టర్డ్ విమానాలను తాలిబన్లు కొన్ని రోజులుగా నిలిపివేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఆయా విమానాల్లో ప్రయాణించేందుకు సన్నద్ధమైన వందలాది మంది ప్రయాణికులు ప్రస్తుతం తాలిబన్ల వద్దే బందీలుగా ఉన్నట్లు అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకుడు, విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైఖేల్ మెక్‌కౌల్ చెప్పారు.
అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న నాలుగు విమానాల్లో ఉన్న ప్రయాణికులంతా అఫ్గాన్ పౌరులేనని, వారిలో చాలా మందికి పాస్‌పోర్టులు, వీసాలు, ఇతర ధ్రువపత్రాలు లేవని, అందుకే దేశం విడిచి వెళ్లలేకపోతున్నారని ఆఫ్గాన్ అధికారి ఒకరు అతెలిపారు. అయితే అమెరికా వాదన మరోలా ఉంది. ప్రయాణికుల్లో తమ దేశ పౌరులు కూడా ఉన్నారని రిపబ్లికన్ నాయకుడు మైఖేల్ మెక్‌కౌల్ స్పష్టం చేశారు. వారు విమానాల్లోనే కూర్చొని, తాలిబన్ల చెరలో బందీలుగా ఉన్నారని చెప్పారు. బందీలను విడిచిపెట్టడానికి డిమాండ్లు చేయాలని తాలిబన్లు యోచిస్తున్నారని ఆరోపించారు. డబ్బు లేదా తాలిబన్ కొత్త ప్రభుత్వానికి చట్టబద్ధత అనేవే ఈ డిమాండ్లు కావొచ్చని చెప్పుకొచ్చారు. కాగా తాలిబాన్లు మహిళలపై ఎన్నో కఠిన ఆంక్షలను అమలు చేస్తూ వస్తున్నారు. తమ హక్కులు కాపాడాలని.. అన్నిట్లోనూ తమకు అవకాశాలు కల్పించాలని మహిళలు ఓ వైపు పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆఫ్ఘన్ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది మహిళలు తాలిబాన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Technology Video: ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు.. ఎడారిలో మంచినీరు తయారుచేసే రోబో.. (వీడియో)
Know This video: ఇదేం.. ఎస్కేప్ సామీ.!చెంచాలతో సొరంగం తవ్వి జైల్ నుంచి పరార్(వీడియో).