Know This video: ఇదేం.. ఎస్కేప్‌ సామీ.!చెంచాలతో సొరంగం తవ్వి జైల్‌ నుంచి పరార్(వీడియో).

Know This video: ఇదేం.. ఎస్కేప్‌ సామీ.!చెంచాలతో సొరంగం తవ్వి జైల్‌ నుంచి పరార్(వీడియో).

Anil kumar poka

|

Updated on: Sep 09, 2021 | 9:22 AM

కొన్ని కేసుల్లో బయటపడే నిజాలు విన్నప్పుడు లేదా చూసిన్నప్పుడు చాలా షాకింగ్‌ ఉంటాయి. అయితే ఆ కారణం కాస్త ఫన్నీగా ఉన్నా.. అది ముమ్మాటికి నిజమై ఉంటుంది. ఇక తాజాగా అలాంటి ఓ ఘటనే ఇజ్రాయెల్‌లో చోటుచేసుకుంది.

కొన్ని కేసుల్లో బయటపడే నిజాలు విన్నప్పుడు లేదా చూసిన్నప్పుడు చాలా షాకింగ్‌ ఉంటాయి. అయితే ఆ కారణం కాస్త ఫన్నీగా ఉన్నా.. అది ముమ్మాటికి నిజమై ఉంటుంది. ఇక తాజాగా అలాంటి ఓ ఘటనే ఇజ్రాయెల్‌లో చోటుచేసుకుంది. భారీ భద్రత ఉండే ఓ జైలు నుంచి కొందురు ఖైదీలు తప్పించుకున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అది కూడా ఓ టీ-స్పూన్‌తో వాళ్లు తప్పికున్నారు. అవును మీరు విన్నది నిజమే..!

ఇంతకీ వాళ్లు ఎలా తప్పించుకున్నారో తెలుసా..?
జైలు గ‌ది డిజైన్‌లో ఉన్న లొసుగుల‌ను వాళ్లు త‌మ‌కు అనుకూలంగా మార్చుకొని ఈ సొరంగం త‌వ్విన‌ట్లు ఇజ్రాయెల్ జైళ్ల శాఖ తెలిపింది. జైలు గోడ‌ల వెనుక ఉన్న ఖాళీ ప్ర‌దేశం ఈ ఖైదీల‌కు ఉప‌యోగ‌ప‌డింది. వాళ్లు చాలా ప‌క్కాగా ప్లాన్ చేసి ఈ ప‌ని చేశార‌ని, బ‌య‌టి వాళ్ల స‌హ‌కారం కూడా ఇందులో ఉండొచ్చ‌ని జైలు అధికారులు అనుమానిస్తున్నారు.

ఓ చెంచాతో చాలా నెల‌ల పాటు శ్ర‌మించి వాళ్లు ఈ సొరంగం తవ్విన‌ట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్ల‌డించింది. ఆ తుప్పు ప‌ట్టిన చెంచా ఎవ‌రికీ క‌నిపించ‌కుండా.. జైలు గ‌దిలోని ఓ ఫొటో వెనుక దాచారు. పారిపోయిన వాళ్ల‌లో న‌లుగురు ఖైదీలు జీవిత‌ఖైదు శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. అయితే పారిపోయిన ఆరుగురు ఖైదీల్లో ఐదుగురు ఇస్లామిక్ జిహాద్‌కు చెందిన వాళ్లు కాగా.. ఒకరు అల్‌-అక్సా మార్టిర్స్ బ్రిగేడ్ నాయ‌కుడు. వీళ్లంతా గిల్బోవా జైల్లో ఒకే సెల్‌లో ఉండేవారు.
మరిన్ని ఇక్కడ చూడండి: తాలిబన్లకు అండగా పాక్‌.! పంజ్‌షీర్‌లో పాక్‌ విమానం చక్కర్లు..!(వీడియో): Pakistan Plane In Afghan Video.

Kidney sale Video: త్యాగమూర్తివయ్య.. కిడ్నీ అమ్మి మరీ భార్యకు ఐఫోన్‌ గిఫ్ట్‌ ఇచ్చిన భర్త(వీడియో వైరల్).

Viral Video: 24 ఏళ్ల తర్వాత లిఫ్ట్‌ తలుపులు తెరిచిన ఆస్పత్రి సిబ్బంది.. లోపలేముందో చూస్తే షాక్‌ ! (వీడియో)

Ants in aircraft: ఫ్లైట్ జర్నీలో జాగ్రత్త..! విమానంలో భయపెట్టిన ఎర్ర చీమల దండు..!వీడియో వైరల్