Technology Video: ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు.. ఎడారిలో మంచినీరు తయారుచేసే రోబో.. (వీడియో)

Technology Video: ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు.. ఎడారిలో మంచినీరు తయారుచేసే రోబో.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 09, 2021 | 9:32 AM

ఆధునిక కాలంలో పెరుగుతున్న టెక్నాలజీతో మానవుడు ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు. అమెరికా వెళ్ళొచ్చినంత ఈజీగా అంతరిక్షానికి వెళ్లొచ్చేస్తున్నాడు. టెక్నాలజీతో సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంజనీర్‌ అద్భుతాన్ని చేసి చూపించాడు...

ఆధునిక కాలంలో పెరుగుతున్న టెక్నాలజీతో మానవుడు ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు. అమెరికా వెళ్ళొచ్చినంత ఈజీగా అంతరిక్షానికి వెళ్లొచ్చేస్తున్నాడు. టెక్నాలజీతో సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంజనీర్‌ అద్భుతాన్ని చేసి చూపించాడు. ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు చేయవచ్చంటూ మరోసారి నిరూపించాడు. అతను ఒక రోబోను తయారు చేశాడు.. ఈ రోబో ఎడారిలో మంచినీటిని తయారుచేస్తుందట.. అదేలాగో చూద్దాం..

ఈజిప్టుకు చెందిన 28 ఏళ్ల ఇంజనీర్‌ ఒక అద్భుతాన్ని చేశాడు. ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు చేయవచ్చని నిరూపించాడు. ఎడారిలో మంచినీరు తయారుచేసే ఒక రోబోను సృష్ఠించాడు. అతని పేరు మహమూద్ ఎల్ కోమి. అతను తయారు చేసిన రోబోట్ పేరు ఇలూ. ఇది ఎడారిలోని గాలి నుంచి నీటిని తయారు చేస్తుందని ఆయన తెలిపాడు. కృత్రిమ మేధస్సు సహాయంతో గాలిలో ఉన్న తేమను నీటిగా మారుస్తుందట. దీంతో ఇక అంగారక గ్రహంపైకి వెళ్లే వ్యోమగాములకు నీటి కొరత ఉండదంటూ చెప్పుకొచ్చాడు. ఈ రోబో తేమను గ్రహించి అంగారకుడిపై కూడా నీటిని తయారు చేయగలదని ఇంజనీర్ కోమి పేర్కొన్నారు.

ఇంజనీర్ ఎల్ కోమీ తెలిపిన ప్రకారం, ఇలూ కృత్రిమ మేధస్సు సహాయంతో పనిచేస్తుంది. రిమోట్‌తో దీనిని నియంత్రించవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని తయారు చేయగల సాంకేతికతతో తయారు చేశామని తెలిపాడు కోమి. ఎటువంటి సమస్య లేకుండా రోజూ 5000 లీటర్ల నీటిని అందించగల అనేక రోబోలను తాను తయారు చేయగలనని పేర్కొన్నాడు. ఇతర సాంకేతికతలతో పోలిస్తే ఈ రోబోట్‌తో నీటిని తయారు చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువని తెలిపాడు. ప్రస్తుతం గాలి నుంచి నీటిని తయారు చేయడానికి మెకానికల్ హీట్ ఎక్స్ఛేంజర్‌‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ ఎంతో ఖరీదైనది. అలాగే దీనికి చాలా శక్తి అవసరం. ఇలూ మాత్రం చాలా చౌకగా, సమర్థవంతమైన నీటిని తయారు చేస్తోందని, మెకానికల్ హీట్ ఎక్స్ఛేంజర్‌‌లకు ప్రత్యామ్నాయంగా ఈ రోబోట్ మారనుందని ఎల్‌ కోమి తెలిపారు.ఇలూ రోబోను చాలా తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ సమయంలోనే తయారు చేశానని, దీని తయారీకి 9 నెలల సమయం పట్టిందని తెలిపారు కోమి. ఈ రోబో తయారీకి 18 వేల రూపాయలు మాత్రమే ఖర్చయిందని తెలిపారు. ఒక లీటరు నీరు తయారుచేయడానికి కేవలం 7 పైసలు మాత్రమే ఖర్చవుతుందని, అదే మెకానికల్‌ హీట్‌ ఎక్సేంజర్‌లతో అయితే ఒక లీటరు నీటికి 75 పైసలు ఖర్చవుతుందని తెలిపాడు. కరువుతో అల్లాడే ప్రాంతాలు, నీరు అస్సలు అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ఇలూ పెద్ద ఎత్తున నీటిని తయారు చేస్తుందని, ఇకపై ఎలాంటి ప్రాంతంలోనైనా నీటి కరవు ఉండదని ఇంజనీర్ కోమి చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Know This video: ఇదేం.. ఎస్కేప్‌ సామీ.!చెంచాలతో సొరంగం తవ్వి జైల్‌ నుంచి పరార్(వీడియో).

తాలిబన్లకు అండగా పాక్‌.! పంజ్‌షీర్‌లో పాక్‌ విమానం చక్కర్లు..!(వీడియో): Pakistan Plane In Afghan Video.

Kidney sale Video: త్యాగమూర్తివయ్య.. కిడ్నీ అమ్మి మరీ భార్యకు ఐఫోన్‌ గిఫ్ట్‌ ఇచ్చిన భర్త(వీడియో వైరల్).

Viral Video: 24 ఏళ్ల తర్వాత లిఫ్ట్‌ తలుపులు తెరిచిన ఆస్పత్రి సిబ్బంది.. లోపలేముందో చూస్తే షాక్‌ ! (వీడియో)

Published on: Sep 09, 2021 09:31 AM