Ants in aircraft: ఫ్లైట్ జర్నీలో జాగ్రత్త..! విమానంలో భయపెట్టిన ఎర్ర చీమల దండు..!వీడియో వైరల్
విమానంలో ప్రయాణం, అది కూడా వేలకు వేలు పోసి కొన్న బిజినెస్ క్లాస్‌లో, ఎంతో శుభ్రంగా, కంఫర్ట్‌గా ప్రయాణం ఉంటుందని అనుకుంటాం. కానీ సీటుపై ఎర్ర చీమలు వరుస కట్టి ప్రయాణిస్తుంటే, ఎక్కడ మనల్ని కుడతాయోనని టెన్షన్ పడ్డ సందర్భం వస్తుందని ఎవరూ ఊహించరు. తాజాగా...
విమానంలో ప్రయాణం, అది కూడా వేలకు వేలు పోసి కొన్న బిజినెస్ క్లాస్‌లో, ఎంతో శుభ్రంగా, కంఫర్ట్‌గా ప్రయాణం ఉంటుందని అనుకుంటాం. కానీ సీటుపై ఎర్ర చీమలు వరుస కట్టి ప్రయాణిస్తుంటే, ఎక్కడ మనల్ని కుడతాయోనని టెన్షన్ పడ్డ సందర్భం వస్తుందని ఎవరూ ఊహించరు. తాజాగా ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకి అలాంటి అనుభవమే ఎదురైంది.ఎయిర్ ఇండియా విమానంలోఅత్యంత ఖరీదైన బిజినెస్ క్లాస్‌లో టికెట్ కొనుక్కున్న ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. బిజినెస్ క్లాస్ ఎంతో పరిశుభ్రంగా, సౌకర్యంగా ఉంటుందని భావించిన వారికి నిరాశపరిచింది ఓ ఘటన. దిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే విమానం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరాల్సి ఉండగా, టేకాఫ్ కావడానికి కాస్త ముందు బిజినెస్ క్లాస్‌లో చీమల వరుస కనిపించింది.
దీంతో మరో విమానాన్ని సిద్ధం చేసి అందులోకి ప్రయాణికులను ఎక్కించారు. ఈ తతంగం అంతా పూర్తయ్యేసరికి మూడు గంటలు పట్టింది. ఆ విమానం సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరింది. అయితే ప్రయాణికుల వెర్షన్‌ని ఎయిర్ ఇండియా ఖండించింది. విమానంలో చీమలు లేవని, టేకాఫ్ రద్దు కాలేదని సాయంత్రం ట్విటర్‌లో పేర్కొంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan Crisis Live Video: ఆఫ్ఘనిస్థాన్ మహిళలపై పెరిగిన అరాచకాలు.. తాలిబన్లపై తిరగబడ్డ మహిళ..!(వీడియో).
Ashu Reddy-RGV video: బ్యూటీ బోల్డ్ ఇంటర్వ్యూలో రచ్చ.. ఆర్జీవికి ముద్దు పెట్టిన అషు రెడ్డి(వీడియో).
YS Sharmila: ఎవరి కోసం ఎవరున్నారు..?పొండిరా పోండి..!షర్మిలకు షాక్ ల మీద షాక్ లు..!(వీడియో).