బిగ్ బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే.? హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.!

Bigg Boss 5 Telugu: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 అట్టహాసంగా ప్రారంభమైంది. హౌస్‌లోకి 19 మంది కంట్‌స్టెంట్లు మొదటి రోజే వెళ్లారు. మునుపెన్నడూ...

బిగ్ బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే.? హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.!
Bigg Boss

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 అట్టహాసంగా ప్రారంభమైంది. హౌస్‌లోకి 19 మంది కంట్‌స్టెంట్లు మొదటి రోజే వెళ్లారు. మునుపెన్నడూ లేనంతగా 5మచ్ సందడితో రెండో రోజు నుంచే అలకలు, ఏడుపులు, గొడవలు మొదలయ్యాయి. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గొడవలు అన్నీ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో భాగంగా సన్నీ-షణ్ముఖ్, జెస్సీ-విశ్వ, నటరాజ్-రవి మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే.. సరయూ, జశ్వంత్, యాంకర్ రవి, హమీదా, మానస్, ఆర్జే కాజల్ తొలివారం నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆరుగురు కంట్‌స్టెంట్లలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నారు. ఇక మొదటి మూడు రోజులు పరిశీలిస్తే.. ఒక కంట్‌స్టెంట్ ఈ వారం ఎలిమినేట్ కావడం పక్కాగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. ఆ కంట్‌స్టెంట్ మరెవరో కాదు జెస్సీ.

జెస్సీ అనగా జశ్వంత్ 2018లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మొదట్లో కొంచెం సెన్సిటివ్, ఇన్నోసెంట్‌గా కనిపించిన జెస్సీ.. ఆ తర్వాత తనలోని షేడ్స్ అన్నింటిని ఒక్కొక్కటిగా బయటికి చూపిస్తున్నాడని నెటిజన్లు నెట్టింట కామెంట్ చేస్తున్నారు.

చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ఎవరికి గౌరవం ఇవ్వకుండా అవమానించేలా ప్రవర్తిస్తుండటం వల్లే గొడవలు మొదలవుతున్నాయని అభిమానులు చెబుతున్నారు. ఇప్పటికే నామినేషన్ చేసినవాళ్లతో గొడవపడి కన్నీళ్లు పెట్టుకున్న జెస్సీ.. మంగళవారం ఆనీ మాస్టర్‌తో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఆమెను సోఫాపై కూర్చోనీయకుండా జెస్సీ కాలు పెట్టడంతో.. ఆనీ మాస్టర్ ఫైర్ అయింది. జశ్వంత్ కూడా ధీటుగా రెచ్చిపోయాడు. ఇద్దరి గొడవ తారస్థాయికి చేరిందని చెప్పొచ్చు.

ఇక అనీ మాస్టర్‌ విషయంలో.. జశ్వంత్‌దే తప్పు అని అందరి వాదన. గొడవ అనంతరం అనీ మాస్టర్ దగ్గరకు వెళ్లి జెస్సీ సారీ చెప్పినా మాటల యుద్ధం ఆగలేదు. ఈ క్రమంలోనే జెస్సీ ప్రవర్తించే తీరు చాలామంది ప్రేక్షకులకు నచ్చట్లేదు. దీనితో అతడే ఈ వారం ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. చూడాలి ఇందులో ఏది నిజమో తెలియాలంటే.. వీకెండ్ వరకు ఆగాల్సిందే.!

Click on your DTH Provider to Add TV9 Telugu