Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్‏కు సేవలు చేసిన లోబో.. ప్రతీకారం తీర్చుకుంటానంటూ ప్రతిజ్ఞ..

బిగ్‏బాస్ సీజన్ 5 మొదటి సారే ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను లొపలికి పంపించారు. అయితే అందులో తెలిసిన వారు కొందరు ఉండగా..

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్‏కు సేవలు చేసిన లోబో.. ప్రతీకారం తీర్చుకుంటానంటూ ప్రతిజ్ఞ..
Lobo
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 12, 2021 | 5:01 PM

బిగ్‏బాస్ సీజన్ 5 మొదటి సారే ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను లొపలికి పంపించారు. అయితే అందులో తెలిసిన వారు కొందరు ఉండగా.. మరికొందరి ముఖలు అస్సలు తెలియవు. ఇక మొదటి రోజే ఇంట్లో కన్నీళ్లు పెట్టుకుని అమాయకుడిగా కనిపించిన జెస్సీ గొడవలకు కేరాఫ్ అడ్రస్‏గా మారాడు. ఇక లహరి సైతం కాజల్‏తో నిత్యం గొడవకు దిగేందుకే ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేవలం కాజల్ మాత్రమే కాకుండా… మిగతా ఇంటి సభ్యులతో లహరికి వరుసగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇంట్లో ఎమోషనల్ డ్రామాలే ఎక్కువగా సాగుతున్నాయి. ఇక కాస్తైన నవ్విస్తోంది లోబో అని మాత్రమే చెప్పుకోవాలి. తన కామెడీతో హౌస్‏మేట్స్ ను మాత్రమే కాకుండా ప్రేక్షకులను సైతం నవ్విస్తున్నాడు లోబో. ఇదిలా ఉంటే.. నిన్నటి ఎపిసోడ్‏లో మానస్ తర్వాత సిరి పవర్ హౌస్ శక్తి చూపరా డింభకాలో  గెలిచింది.

దీంతో బిగ్ బాస్ సిరి ఇద్దరు సభ్యులను ఎంచుకోవాలని…అందులో ఒకరు యాజమానిగా .. మరొకరు వారికి సేవకుడిగా ఉండాలని సూచించారు. దీంతో షణ్ముఖ్‏ను యాజమానిగా.. లోబోను సేవకుడిగా ఎంచుకుంది సిరి. ఇదే విషయాన్ని హౌస్‏మేట్స్‏తోనూ చెప్పింది. ఇక టైం కోసమే ఎదురుచూస్తున్న షణ్ముఖ్.. లోబోను ఆడుకున్నాడు. వెంటనే లోబోతో మసాజ్ చేయించుకున్నాడు షణ్ముఖ్.. ఆ తర్వాత ఇంటిసభ్యులను ఇమిటేట్ చేయాలని ఆదేశించాడు. ఇక లోబో అందరిని అనుకరిస్తూ… ఇంట్లో కామెడీ పండించాడు. ఇక ఆ తర్వాత ర్యాప్ సాంగ్ పాడి ఆకట్టుకున్నాడు. అయితే అప్పటివరకు కామెడీగా సాగుతున్న ఆట మధ్యలో సిరిని పవర్ రూమ్‏లోకి పిలిచిన బిగ్ బాస్ టాస్క్ సీరియస్‏గా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మిగతావాళ్లకు సేవలు చేస్తున్న లోబో.. అవన్ని ఆపేసి కేవలం షణ్ముఖ్‏కు మాత్రమే సేవలు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ టాస్క్‏లో భాగంగా సేవలు చేయించుకున్న షణ్ముఖ్ పై ప్రతికారం తీర్చుకుంటాను అంటూ ప్రతిజ్ఞ చేశాడు లోబో.

Also Read: Bigg Boss 5 Telugu: ఇదేం రచ్ఛరా నాయన.. మరీ ఆలూ కర్రీ కోసం ఇంత సీన్ అవసరమా..? ఓ రేంజ్‌లో ఆ ఇద్దరి గొడవ

Bigg Boss 5 Telugu: అందరూ అందరే.. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య రచ్చ.. సెన్స్ లేదా అంటూ ఆ బ్యూటీ ఫైర్..