Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: అందరూ అందరే.. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య రచ్చ.. సెన్స్ లేదా అంటూ ఆ బ్యూటీ ఫైర్..

బిగ్‏బాస్ సీజన్ 5 ప్రారంభమైన మూడు రోజులలో ప్రతి రోజు గొడవలతో ప్రేక్షకులకు సరైన స్టఫ్ ఇస్తున్నారు కంటెస్టెంట్స్. మొదటి రోజు బిగ్ బాస్

Bigg Boss 5 Telugu: అందరూ అందరే.. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య రచ్చ.. సెన్స్ లేదా అంటూ ఆ బ్యూటీ ఫైర్..
Bb5
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 12, 2021 | 5:01 PM

బిగ్‏బాస్ సీజన్ 5 ప్రారంభమైన మూడు రోజులలో ప్రతి రోజు గొడవలతో ప్రేక్షకులకు సరైన స్టఫ్ ఇస్తున్నారు కంటెస్టెంట్స్. మొదటి రోజు బిగ్ బాస్ షో సాఫీగా సాగిన రెండు రోజు నుంచే అసలు రచ్చ మొదలైంది. అప్పుడే కంటెస్టెంట్స్‏కు ఒకరంటే ఒకరికి పడడం లేదు. మొదటి రోజే నామినేషన్ ప్రక్రియతో సభ్యుల మధ్య ఫిటింగ్ పెట్టాడు బిగ్‏బాస్. ఇక ఆ రోజు మొదలైన రచ్చ.. రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. బిగ్‏బాస్ సూచనలు, సలహాలు అవసరం లేకుండానే.. ప్రేక్షకులను తమవైపుకు తిప్పుకునే పనిలో పడ్డారు కంటెస్టెంట్స్. ఇక నిన్న సెప్టెంబర్ 8న బిగ్ బాస్ ఇంట్లో మరోసారి గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే.. యానీ మాస్టర్, జెస్సీకి మధ్య జరిగిన గొడవ మరోసారి కంటిన్యూ అయ్యింది. దీంతో యానీ మాస్టర్ దగ్గరకు వచ్చి జెస్సీ కాళ్లు పట్టుకుని మరీ క్షమాపణ అడిగాడు. మీరు నా తల్లిలాంటి వాళ్లు తప్పు నాదే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏంటీ తల్లి లాంటి దాన్నా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది యానీ మాస్టర్. ఇక తనది కూడా తప్పే అంటూ ఒక మెట్టు దిగి గొడవకు ఫుల్ స్టాఫ్ పెట్టింది యానీ మాస్టర్.

ఇక ఆ తర్వాత కాజల్ ఇంట్లో వాళ్లు అందరూ పడుకున్న తర్వాతే నిద్రపోవాలనే శిక్ష ఉండడంతో కాజల్ నిద్రపోవడానికి ఇంటి సభ్యులను కన్వెన్స్ చేయడానికి ట్రై చేసింది. దీంతో తను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పడుకోను అని తెగేసి చెబుతూ.. మరోసారి కాజల్‏తో గొడవకు దిగింది లహరి. ఇక తెల్లవార్లూ హమిదా, లహరి, నటరాజ్ మాస్టర్ పడుకోకుండా కాజల్‏ని ఇబ్బంది పెట్టారు. దీంతో చేతులు ఎత్తేసిన కాజల్ వెళ్లి పడుకుంది. ఇక ఆ మరుసటి రోజు హమీద, లహరిల మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. ఎందుకు నువ్ ప్రతిసారీ సమాధానం అలా చెప్తావ్ అంటూ లహరితో హమీదాతో గొడవకు దిగింది. నేను ఎలా మాట్లాడాలో మీరు నేర్పించాల్సిన అవసరం లేదు అని రివర్స్ కౌంటర్ వేసింది హమిదా. నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా అంటే.. ఇక్కడ కుదరదు.. సెన్స్ లేదా ?? నేనేం నీ దగ్గర పనిచేయడం లేదా ? అంటూ ఫైర్ అయ్యింది లహరి. ఆ తర్వాత ప్రియ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది.

Also Read: Krithi Shetty: ‘బేబమ్మా.. వాట్‌ ఇజ్‌ దిస్‌ అమ్మా’.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న కృతీ శెట్టి లేటెస్ట్‌ ఫొటోలు..

Aparna Balamurali: చీరలో ముద్దమందారంలా ఉన్న అపర్ణ బాలమురళి లేటెస్ట్ గ్యాలరీ..