Bigg Boss 5 Telugu: ఇదేం రచ్ఛరా నాయన.. మరీ ఆలూ కర్రీ కోసం ఇంత సీన్ అవసరమా..? ఓ రేంజ్‌లో ఆ ఇద్దరి గొడవ

బిగ్ బాస్ హౌస్‌‌‌లో హంగామా మాములుగా లేదు. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, అల్లర్లు, ఏడుపులు ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. గత సీజన్స్ కంటే ఈ సీజన్‌లో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఇవ్వడానికి కంటెస్టెంట్స్ మొదటి రోజునుంచే

Bigg Boss 5 Telugu: ఇదేం రచ్ఛరా నాయన.. మరీ ఆలూ కర్రీ కోసం ఇంత సీన్ అవసరమా..? ఓ రేంజ్‌లో ఆ ఇద్దరి గొడవ
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 12, 2021 | 4:57 PM

Bigg Boss 5: బిగ్ బాస్ హౌస్‌‌‌లో హంగామా మాములుగా లేదు. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, అల్లర్లు, ఏడుపులు ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. గత సీజన్స్ కంటే ఈ సీజన్‌లో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఇవ్వడానికి కంటెస్టెంట్స్ మొదటి రోజునుంచే కష్టపడుతున్నారు. 106 రోజుల పాటు జరగనున్న బిగ్ బాస్ హంగామాలో 5వ రోజు ఎపిసోడ్ కాస్త రసవత్తరంగా సాగింది. ఈ సారి కార్తీక దీపం సీరియల్ యాక్టర్ ఉమాదేవి. ఆనీ మాస్టర్ మధ్య గొడవ ఓ రేంజ్‌లో జరిగింది. ఆలూ కర్రీ కోసం ఉమాదేవి, ఆనీ మాస్టర్‌ల మధ్య గొడవ జరిగింది. తాను అడిగితే కర్రీ అయిపోయిందని చెప్పారని ..తీరా చూస్తే ఫ్రిడ్జ్‌లో పెట్టారని ఉమాదేవి ఫైర్ అయ్యింది.  ప్రియ- ఆర్జే కాజల్ ఎదో మాట్లాడుకుంటూ ఉండగా.. ఉమాదేవి అక్కడికి వచ్చింది.  ఆలూ కర్రీ ఫ్రిడ్జ్‌లో ఎవరు పెట్టారు.? అని ఆ ఇద్దరినీ ప్రశ్నిచింది.  మిగిలిందని ఆనీ మాస్టర్ ప్రిడ్జ్‌లో పెట్టారని ప్రియ ఆమెకు చెప్పింది. నేను అడిగితే అయిపోయిందని అన్నారు కదా.. కానీ ఫ్రిడ్జ్‌లో ఎలా పెట్టారు అని అడిగింది ఉమా. అందరికన్నా లాస్ట్‌లో తినేవాళ్ల కోసం ఆనీ మాస్టర్ ఫ్రిడ్జ్‌‌లో పెట్టారని చెప్పింది ప్రియా..

‘ఆనీ మాస్టర్ అలా ఎలా పక్కనపెడతారు.. పెట్టకూడదుగా..  అడిగినప్పుడు వాళ్లకి పెట్టాలి.. అలా పక్కనపెట్టడం ఏంటి? కర్రీ లేదనే మళ్లీ మాస్టర్ కోసం వేరే కర్రీ చేయాల్సి వచ్చింది.. నేను అడిగినప్పుడు కర్రీ లేదని చెప్పారు.. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టారంటే ఏం అనుకోవాలి అంటూ ఫైర్ అయ్యింది ఉమా. ఇంతలో అక్కడికి వచ్చిన నటరాజ్ మాస్టర్ ఆమె ఆలూ కర్రీ ఆమెకు ఇచ్చేయండి అని పెద్దగా అరిచేశాడు. దాంతో నేనేమి అడుక్కోవడానికి రాలేదు.. నేనేమి భిక్షం ఎత్తుకోవడం లేదు.. ఉంటే ఉందని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి అంతే కానీ ఇలా దాచిపెట్టకూడదు అంటూ ఉమా కూడా అరిచేసింది. ఆతర్వాత ఆనీ మాస్టర్ అక్కడకు వచ్చి నేను ఎవరికోసం దాచలేదు.. ఏ కర్రీ చేసిన కొంచెం తీసి పక్కనపెట్టమని అందరికి చెప్పాను.. ఎందుకంటే వెనక తినే వాళ్ళకోసం.. వాళ్లకు కరీఉందేమో అని అలా చేశా అని చెప్పింది.. ‘అంటే.. ఫస్ట్ తినడం మానేసి తరువాత తినాలనా? అని ఆనీ మాస్టర్‌ సెటైర్ వేసింది ఉమ.

‘అసలు కలసి తింటే ఏ గొడవ ఉండదు’ అని ఆనీ మాస్టర్ చెప్పగా.. రెండు కూరలు ఎందుకు ఒకే కర్రీ చేసుకుని ఒకేసారి తినండి. నాకు తినడానికి కూర లేదన్నప్పుడు రెండు రెండు కూరలు ఎందుకు చేస్తున్నారు అని ఫైర్ అయ్యింది ఉమాదేవి. దీంతో ఆనీ మాస్టర్ ఇది నా తప్పే  కర్రీ నేనే తీసి పక్కనపెట్టాను.. మరోసారి ఇలా జరగదు అని అంది . దాంతో గొడవ సద్దుమణిగింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Krithi Shetty: ‘బేబమ్మా.. వాట్‌ ఇజ్‌ దిస్‌ అమ్మా’.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న కృతీ శెట్టి లేటెస్ట్‌ ఫొటోలు..

Aparna Balamurali: చీరలో ముద్దమందారంలా ఉన్న అపర్ణ బాలమురళి లేటెస్ట్ గ్యాలరీ..

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత