Karthika Deepam: దీపను చంపడానికి మోనిత ప్రయత్నం.. కోర్టులో తాను నేరం చేయలేదన్న కార్తీక్!

తన పిచ్చిని ప్రేమగా భ్రమిస్తున్న మోనిత.. కార్తీక్ ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని వరుసగా నేరాలు చేస్తూ పోతుంది. కార్తీక్ ను కోర్టులో హాజరు పరిచదానికి పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. దీప మోనితను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.

Karthika Deepam: దీపను చంపడానికి మోనిత ప్రయత్నం.. కోర్టులో తాను నేరం చేయలేదన్న కార్తీక్!
Karthika Deepam 1140
Follow us
KVD Varma

|

Updated on: Sep 09, 2021 | 8:57 AM

Karthika Deepam:  ఆసుపత్రిలో దీప కార్తీక్ కు భోజనం పెడుతుంటుంది. కార్తీక్ దీపకు మోనిత బ్రతికే ఉందనే విషయాన్ని చెబుతాడు. సరిగ్గా అదే సమయంలో మోనిత డాక్టర్ రీనా వేషంలో అక్కడికి వస్తుంది. కార్తీక్ తన విషయం చెప్పడాన్ని గమనిస్తుంది. బయటకు వచ్చి కార్తీక్ కు ఫోన్ చేస్తుంది. తన విషయం దీపకు ఎందుకు చెప్పవంటూ ప్రశ్నిస్తుంది. తనను పెళ్లి చేసుకోకపోతే అందరినీ చంపేస్తానని బెదిరిస్తుంది. మోనిత ఫోన్ లో మాట్లాడుతుండగా దీప మోనితను చూస్తుంది. ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ, మోనిత దీపను నెట్టివేసి అక్కడ నుంచి కారులో పారిపోతుంది. దీప వారణాశితో కలిసి కారులో మోనితను వెంబడిస్తుంది. మరోవైపు దీప కనబడలేదని కార్తీక్ కంగారు పడతాడు. ఆసుపత్రిలో అందరినీ దీప గురించి ప్రశ్నిస్తాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ రామసీతను కూడా దీప కనబడిందా అని ప్రశ్నిస్తాడు. కానీ, ఎవరూ దీపను చూడలేదని చెబుతారు. దీంతో దీప కోసం కార్తీక్ కంగారు పడుతుంటాడు. ఇదీ నిన్నటి ఎపిసోడ్ (1139) లో జరిగిన కథ. మరి తరువాత ఏమైందో ఇప్పుడు చూద్దాం.

మీరు ఖైదీ..

కార్తీక్ దీప కోసం ఆసుపత్రి బయట ఉందేమో వెతకాలని అనుకుంటాడు. కానీ, అక్కడ ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకుంటారు. కార్తీక్ దీప కనబడటం లేదని.. ఆమెకు ప్రాణాపాయం ఉందనీ చెబుతాడు. కానీ, ఇన్స్పెక్టర్ అతని మాట వినడు. కోర్టుకు తీసుకువెళ్ళే ముందు ఖైదీలు అలానే ప్రవర్తిస్తారని.. ఎందరినో తాను చూశాననీ చెప్తాడు. అంతేకాకుండా.. కార్తీక్ ఖైదీ అనీ బయటకు వెళ్లనిచ్చేది లేదనీ చెప్పి అతన్ని రూమ్ లోకి తీసుకువెళతాడు.

దీప పిచ్చి వదల్లేదా?

మరోవైపు మోనిత కారులో వెళుతూ రామసీతకు ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఏం చేస్తున్నాడని అడుగుతుంది. రూమ్ లో ఉన్నాడనీ దీప కనిపించడం లేదని కంగారు పడుతున్నాడనీ చెబుతుంది రమ సీత. ”అయ్యో కార్తీక్ నీకు ఇంకా దీప పిచ్చి వదల్లేదా? దాన్ని చంపెస్తేకానీ నీకు అర్ధం కాదు” అని ఫోన్ లోనే అంటుంది మోనిత. రామసీత ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మేడం అని మోనితను ప్రశ్నిస్తుంది. దీపను కాసేపట్లో చంపబోతున్నాను అని మోనిత చెబుతుంది. మోనితను వెంటాడుతున్న దీప వారణాశితో ఎలాగైనా ఈరోజు మోనిత మిస్ అవకూడదు వారణాశి. పట్టుకుని పోలీసులకు అప్పచెబితే, డాక్టర్ బాబు బయటకు వస్తారు అని చెబుతుంది. ఈలోపు వారణాశి కారులో పెట్రోల్ అయిపొయింది అని చెబుతాడు. మోనిత కారులో వెనక్కి తిరిగి చూస్తె దీప కారు కనిపించదు. ఎక్కడికి పోయింది. చావును వెతుక్కుంటూ వస్తుంది అనుకుంటే.. ఎక్కడో ఆగిపోయినట్టుంది అని అనుకుని కారు ఆపమని డ్రైవర్ కి చెబుతుంది. కారు దిగిన మోనిత డ్రైవర్ కు థాంక్స్ చెబుతుంది. ఇక్కడ నుంచి నేను వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపో అని క్యాబ్ డ్రైవర్ కి చెబుతుంది. క్యాబ్ డ్రైవర్ మీరు జాగ్రత్త అసలే మీకోసం వస్తున్న ఆమె మీ భర్త కోసం మిమ్మల్ని చంపేసేలా ఉంది అంటాడు. అలాగే, మంచివాల్లకే కష్టాలు అని మోనిత యాక్ట్ చేసేస్తుంది. నీ కారు నెంబర్ చూసి ఉండవచ్చు. నిన్ను పట్టుకోవడానికి రావచ్చు. నిన్ను అడిగితే కారులో కస్టమర్ ని తీసుకువెళ్ళానని చెప్పు. అని చెబుతుంది మోనిత. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళుతుంటుంది. మరోవైపు దీప కారు పక్కన నిలబడి మోనిత మిస్ అయినందుకు బాధపడుతుంది. షాక్ లో ఆసుపత్రి దగ్గర పోలీసులు ఉన్న విషయం మర్చిపోయాను. అసలు అక్కడే పోలీసులకు మోనిత సంగతి చెబితే సరిపోయేది అని దీప అనుకుంటూ ఉంటుంది.

దీపను మోనిత చంపేస్తుంది

కార్తీక్ ను తీసుకువెళ్ళడానికి ఏసీపీ రోషిణి వస్తుంది. కార్తీక్ దీప కనిపించడం లేదని చెబుతాడు. మోనిత బ్రతికే ఉందని.. తనకు టీ తెచ్చింది మోనిత అని చెబుతాడు కార్తీక్. దాంతో.. రోషిణి సీరియస్ అవుతుంది. కథలు చెప్పొద్దు. నేను మీ మాటలు నమ్మి నా స్టాఫ్ ను అనుమానించాను. టీ కొట్టు దగ్గర ఎంక్వైరీ చేశాను బసవయ్య కూతురే టీ పట్టుకొచ్చి ఇచ్చింది అని రోషిణి చెబుతుంది. కాదు మేడం బసవయ్యకు మూగ కూతురు ఉంది ఉండవచ్చ్చు కానీ, ఆరోజు నాకు టీ తీసుకువచ్చింది మాత్రం మోనిత. అని కచ్చితంగా కార్తీక్ చెబుతాడు. దీపను మోనిత చంపెస్తుందనీ.. తనను కాపాడమనీ అడుగుతాడు కార్తీక్. ఒక్కరోజు నన్ను కోర్టుకు తీసుకువెళ్లకుండా వాయిదా తీసుకోండి మేడం. దీప గురించి వెతికించండి ఇప్పుడు దీప ఎక్కడ ఉందొ అక్కడే మోనిత కూడా ఉంటుంది అని చెబుతాడు కార్తీక్. కానీ, కార్తీక్ మాటలను అస్సలు లెక్కచేయని రోషిణి కార్తీక్ ను కోర్టుకు తీసుకు రమ్మని పోలీస్ కారులో ఎక్కిస్తుంది.

దీపను ఇప్పుడే చంపేయాలి

నడుచుకుంటూ వెళుతున్న మోనిత దీపను చంపేయాలని అనుకుంటుంది. ఈలోపు పోలీసు కారులో అదే దారిలో కార్తీక్ ను తీసుకువెళుతుంది రోషిణి. అది చూసిన మోనిత జాగ్రత్త పడుతుంది. కార్తీక్ ను కారులో చూసి..”అయ్యో నా కార్తీక్ అనవసరంగా జైలు పాలు అయిపోతున్నావు.” అని బాధపడుతుంది. తరువాత వెన్నక్కి తిరిగి నడవడం మొదలు పెడుతుంది. అక్కడ దీప ఆమెకు కనిపిస్తుంది. వెంటనే చెట్టు చాటున దాక్కుని. నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావే వంటలక్కా అనుకుంటుంది. వెతకబోయిన తీగ కాలికి తగిలింది. ఇక వదిలి పెట్టకూడదు. దీపను ఇప్పుడే చంపేస్తానని అనుకుంటుంది మోనిత.

నేను నేరం చేయలేదు

కోర్టు దగ్గరకు కార్తీక్ ను తీసుకువస్తుంది రోషిణి. అక్కడే బయట వున్న కార్తీక్ తండ్రి ఆనందరావు గుండె నొప్పిగా ఉందని చెబుతాడు. దీంతో అతన్ని పరీక్ష చేయమని రోషిణి చెబుతుంది. ఆనందరావును పరీక్షించిన కార్తీక్.. ఆదిత్య ఫోన్ తీసుకుని మందులు ఆర్డర్ పెడతాడు. తరువాత ఏమీ కాదు కంగారు పడవద్దని ఆనందరావుకు చెబుతాడు. ఎక్కువ ఆలోచించ వద్దంటాడు. తరువాత సౌందర్యతో అమ్మ.. నేను నీ సుపుత్రుడిని. అని చెప్పి.. దీప మొనితను పట్టుకోవడానికి వెళ్ళింది. ఏమవుతుందో అని భయంగా ఉంది అని అంటాడు. దీంతో రోషిణి కోర్టు సెషన్ అయిపోయాకా నేను దీపను వెతికిస్తాను అని చెప్పను కదా.. పడండి టైం అయింది అని లోపలకు తీసుకు వెళుతుంది. అక్కడ కార్తీక్ ను జడ్జి మీరు ఈ నేరం చేశారని ఒప్పుకుంటున్నారా? అని అడుగుతారు. దానికి లేదని చెబుతాడు కార్తీక్.

ఇదీ ఈరోజు ఎపిసోడ్ (1140)లో జరిగింది. కోర్టు కార్తీక్ చెప్పిన మాటలు నమ్మిందా? మోనిత దీపను ఏం చేసింది? ఏసీపీ రోషిణి దీపను వెతికిస్తుందా? ఇవన్నీ తెలియాలంటే.. రేపు ప్రసారం అయ్యే ఎపిసోడ్ 1141 వరకూ వేచి చూడాల్సిందే.

మరిన్ని ‘కార్తీకదీపం’ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karthik Deepam: వామ్మో మోనిత.. ఇంత క్రూరంగానా.. కార్తీకదీపంలో కొత్త ట్విస్ట్!

Karthika Deepam: మోనితను గుర్తుపట్టిన కార్తీక్..ఎలాగైనా కార్తీక్‌ను విడిపించాలనే ప్రయత్నంలో దీప!

Karthika Deepam: కార్తీకదీపంలో కొత్తమలుపు.. మరో పథకం వేసిన మోనిత.. దీపను నిలదీసిన పిల్లలు.. 

Karthika Depam: సూపర్ ట్విస్ట్.. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప.. నమ్మని కుటుంబం!

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు