Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ పై మానస్ అసహనం.. ఓవరాక్షన్ ఎక్కువైందంటూ కామెంట్స్..

బిగ్‏బాస్ సీజన్ 5 మొదటి నుంచే గొడవలు, ఏడుపులు పెడుబోబ్బలతో శ్రుతిమించిన డ్రామాతో సాగుతున్న సంగతి తెలిసిందే. ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గకుండా..

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ పై మానస్ అసహనం.. ఓవరాక్షన్ ఎక్కువైందంటూ కామెంట్స్..
Maanas
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 12, 2021 | 5:01 PM

బిగ్‏బాస్ సీజన్ 5 మొదటి నుంచే గొడవలు, ఏడుపులు పెడుబోబ్బలతో శ్రుతిమించిన డ్రామాతో సాగుతున్న సంగతి తెలిసిందే. ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గకుండా.. నిత్యం వాదనలు, ఆ తర్వాత ఏడ్వడం అంటూ ఎమోషనల్ సీన్స్ క్రియేట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే కాజల్, లహరి మధ్య వార్ నడుస్తుండగా.. మరోవైపు యానీ మాస్టర్, జెస్సీల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. తనకు మర్యాద ఇవ్వకపోతే ఉరుకునేది లేదంటూ యానీ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది జెస్సీకి. దీంతో క్షమించాలని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే యానీ మాస్టర్ కూడా తప్పు తనవైపు కూడా ఉందని చెబుతూ వెనక్కి తగ్గి.. ఆ గొడవకు అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టింది.

ఇక నిన్నటి ఎపిసోడ్‏లో ఎప్పటిలాగే లహరి.. కాజల్‏తో గొడవకు దిగింది. తాను నిద్రపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇక ఆ తర్వాత హమిదా తనతో మాట్లాడే విధానం సరిగ్గా లేదని.. సెన్స్ ఉందా అంటూ సీరియస్‏ అయ్యింది లహరి. తను అలాగే మాట్లాడతానని.. నా ఇష్టం అంటూ హమిదా సైతం రివర్స్ కౌంటర్ వేసింది. దీంతో మరోసారి ఇంట్లో రచ్చ జరిగింది. అయితే ఇప్పటివరకు జరిగిన గొడవల కంటే.. మరో ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య వార్ జరిగేలా కనిపిస్తోంది. యాంకర్ రవి పై మానస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కనిపించాడు.

సిరికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో భాగంగా.. షణ్ముఖ్ యాజమానిగా.. లోబో సేవకుడిగా నటించారు. ఇంట్లో సభ్యులందరిని ఇమిటెట్ చేయాలని షన్ను ఆదేశించగా.. లోబో హౌస్‏మేట్స్ లాగా నటించాడు. ఇందులో భాగంగా.. ప్రియాంక సింగ్ కిచెన్‏లో వంట చేస్తున్నట్లుగా లోబో నటించగా.. శ్రీరామ చంద్ర, మానస్ ఇద్దరూ అక్కడే అటు ఇటూ తిరుగుతూ సైడ్ కొడుతున్నట్లుగా నటించారు రవి, విశ్వ. ఇందులో యాంకర్ రవి మానస్ గా నటించాడు. ప్రియాంక వంటగదిలో ఉంటే.. మానస్ అక్కడక్కడే తిరుగుతూ… సైట్ కొడుతున్నట్లుగా నటించాడు. దీంతో మానస్ కాస్త హర్ట్ అయినట్లుగా కనిపిస్తున్నాడు. ప్రతి సారి ఆ విషయాన్ని ఇన్నిసార్లు తీయాల్సిన అవసరం లేదని.. ఇది తను హోస్ట్ చేస్తున్న షో, ఈవెంట్ కాదని.. బిగ్ బాస్ సీజన్ హోస్ట్ కాదు.. అయినా ఆ విషయాన్ని ఎందుకు ఇంతగా లాగుతున్నాడన్నాడు మానస్. ప్రియాంక చాలా మంచిదని.. ఆమె అంటే ఓ ఆరాధనభావం ఉందని.. ఇతరుల అనకున్నట్లుగా ఏం లేదని చెప్పుకొచ్చాడు మానస్.

Also Read: RC15: అయ్య బాబోయ్.. ఒక్క పోస్టర్ కే ఇంత ఖర్చా ? అంచనాలు పెంచేస్తోన్న శంకర్-చరణ్ సినిమా..

Bigg Boss 5 Telugu: అందరూ అందరే.. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య రచ్చ.. సెన్స్ లేదా అంటూ ఆ బ్యూటీ ఫైర్..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!