Bigg Boss 5 Telugu: భయమా..? లేక ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజనా..? కెమెరాకు కనబడని షణ్ముఖ్.. నావల్ల కాదు అంటూ…

బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది... ఎప్పటిలానే కంటెస్టెంట్స్ మధ్య గొడవలతో, ఏడుపులతో , అల్లర్లతో  సాగుతుంది బిగ్ బాస్ సీజన్ 5. అయితే ఈ సారి హౌస్‌లోకి వచ్చిన వాలందరు..

Bigg Boss 5 Telugu: భయమా..? లేక ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజనా..? కెమెరాకు కనబడని షణ్ముఖ్.. నావల్ల కాదు అంటూ...
Shanmukh
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 12, 2021 | 4:57 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది… ఎప్పటిలానే కంటెస్టెంట్స్ మధ్య గొడవలతో, ఏడుపులతో , అల్లర్లతో  సాగుతుంది బిగ్ బాస్ సీజన్ 5. అయితే ఈ సారి హౌస్‌లోకి వచ్చిన వాలందరు ఎలాగైనా టైటిల్ గెలవాలని కసిగా ఆడుతున్నారు. ఎవరి స్టైల్‌లో వాళ్ళు ఎంటర్టైనర్ చేయడానికి, ఎక్కువ రోజులు ఉండేలా ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఒక్క కనేటెస్టెంట్ మాత్రం ఎందుకొచ్చానా.. అన్నట్టుగా ఉంటున్నాడు. అతను ఎవరో కాదు యుట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.  బిగ్‌బాస్‌ సీజన్‌-5లో పదో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్‌ మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే కాస్త బిడియంగానే ఉంటున్నాడు. పలు షార్ట్ ఫిలిమ్స్‌తో పాపులర్ అయిన ఈ కుర్రాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి సైలెంట్‌గా ఉంటూ.. పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు. మిగిలిన వారందరూ తమ గేమ్ తాము ఆడుతూ ప్రేక్షకుల కళ్ళలో పడేందుకు ప్రయత్నిస్తుంటే.. షణ్ముఖ్ మాత్రం కెమెరాలకు కనబడకుండా ఉంటున్నాడు. మొదటి రోజు కొత్త కదా ఆ తర్వాత నుంచి మింగిల్ అవుతాడులే.. అనుకుంటే 5 రోజులు అవుతున్న మనోడు మాత్రం సైలెంట్‌గానే ఉంటున్నాడు. ఒకరు ఇద్దరితో తప్ప షన్నూ ఎవరితోనూ పెద్దగా కలవడం కానీ యాక్టివ్‌గా ఉంటూ హడావిడి చేయడం కానీ కనిపించడం లేదు.

బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలన్నా.. ప్రేక్షకుల ఓట్లు గెలవాలన్నా.. యాక్టివ్‌గా ఉంటూ టాస్క్‌లో హుషారుగా కనిపించాలి. కానీ షణ్ముఖ్ మాత్రం ఇంకా మొహమాటంగా.. నలుగురితో కలవకుండా ఉండిపోతున్నాడు. హౌస్‌లోకి వెళ్లే ముందే కింగ్ నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. లోపల ఉన్నవాళ్లు మామూలువాళ్ళు కాదు పీస్ పీస్ చేస్తారు అని.. ఆ భయమో లేక ఏం చేయాలో.. గేమ్ ఏలా ఆడాలో.. తెలియని కన్ఫ్యూజనో కానీ షన్నూ పెద్దగా కనబడకుండా ఉండటానికే ప్రయత్నిస్తున్నాడు. ఇక మొన్నటికి మొన్న ‘ఇంతమంది జనాల మధ్య నేనెప్పుడూ లేను, బయటికెళ్లి వీడియోలు చేసుకుంటా కానీ ఇంత ప్రెజర్‌ తట్టుకోలేను..’ అంటూ నా వల్ల కాదు అని చెప్పకనే చెప్పేశాడు. మరి ఇక ముందైనా షన్నూ యాక్టివ్ అవుతాడా లేక ఇలానే సైలెంట్‌గా ఉండి బయటకు వచేస్తాడా అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: నా ఫుల్ సపోర్ట్ ఆ కంటెస్టెంట్‏కే.. బిగ్‏బాస్ షోపై మెగా బ్రదర్ నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Shah Rukh Khan: అట్లీ -షారుక్ ఖాన్ సినిమాకు పనిచేయనున్న ఆ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్..!