Anasuya Bharadwaj : నెట్టింట అందాల అనసూయకు యమా క్రేజ్.. కవ్వించే ఈ వయ్యారికి ఇన్‌స్టాలో భారీ ఫాలోయింగ్..

అనసూయ భరద్వాజ్.. ఈ ముద్దుగుమ్మ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. బుల్లితెర పై పలు టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యింది ఈబ్యూటీ. అందం.. అభినయం

Anasuya Bharadwaj : నెట్టింట అందాల అనసూయకు యమా క్రేజ్.. కవ్వించే ఈ వయ్యారికి ఇన్‌స్టాలో భారీ ఫాలోయింగ్..
Anasuya
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 09, 2021 | 1:11 PM

అనసూయ భరద్వాజ్.. ఈ ముద్దుగుమ్మ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. బుల్లితెర పై పలు టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యింది ఈబ్యూటీ. అందం.. అభినయం ఉన్న ఈ చిన్నది బుల్లితెర పైనే కాదు.. వెండితెరపైనా సత్తాచాటుతూ దూసుకుపోతుంది. కేవలం యాంకరింగ్‌‌‌తోనే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను రాణిస్తుంది ఈ రంగమ్మత్త. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన రంగస్థలం సినిమాలో.. రంగమ్మాత్త పాత్రలో అనసూయ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ తర్వాత అనసూయకు తెలుగులో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ఆ తర్వాత క్షణం, కథనం వంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్‏లలో నటించి మెప్పించింది. ఇటీవల థ్యాంక్యూ బ్రదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనసూయ. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నిత్యం గ్లామర్ ఫొటోలతోపాటు తన సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది ఈ వయ్యారి భామ. అనసూయ చిన్న పోస్ట్ పెట్టిన చాలు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్ అయిపోతుంది.  వెంటనే నెటిజన్లు కామెంట్లతో లైకులతో హెరెత్తిస్తారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌‌‌లో భారీ ఫాలోయింగ్ ఉంది ఈ సొగసరికి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌‌లో 1 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది అనసూయ. నిత్యం అందాల ఫొటోలతో కవ్వించే అనసూయ 1మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకోవడం మాత్రమే కాదు.. ఈ సంఖ్య ముందు ముందు మరింత పెరుగుతుందని అంటున్నారు నెటిజన్లు. ఇక అనసూయ సినిమాల  విషయాన్ని కొస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనసూయ కనిపించనుందని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: నా ఫుల్ సపోర్ట్ ఆ కంటెస్టెంట్‏కే.. బిగ్‏బాస్ షోపై మెగా బ్రదర్ నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Shah Rukh Khan: అట్లీ -షారుక్ ఖాన్ సినిమాకు పనిచేయనున్న ఆ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్..!

Bigg Boss 5 Telugu: భయమా.. లేక ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజనా.. కెమెరాకు కనబడని షణ్ముఖ్.. నావల్ల కాదు అంటూ