Acharya Movie: ఆ స్పెషల్ రోజుపై కన్నేసిన ఆచార్య.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా ?
రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు చిరు.
రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు చిరు. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు.. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నాడు చిరు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్దా పాత్రలో నటిస్తుండగా.. కాజల్ హీరోయిన్గా.. పూజా హెగ్డే కీలకపాత్రలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. గతంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇటీవల కోవిడ్ కేసులు తగ్గి.. థియేటర్లు తెరుచుకున్న ఆచార్య సినిమా నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేడ్ ఒకటి ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే గతంలో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం మేకర్స్… దీపావళికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావాలనుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సన్నహాలు కూడా చేస్తున్నారట. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అలాగే ఇందులో చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ పై మానస్ అసహనం.. ఓవరాక్షన్ ఎక్కువైందంటూ కామెంట్స్..