Shah Rukh Khan: అట్లీ -షారుక్ ఖాన్ సినిమాకు పనిచేయనున్న ఆ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్..!

చేసినవి తక్కువ సినిమాలే అయినా స్టేర్ డైరెక్టర్‌గా మారిపోయాడు అట్లీ. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా మారిన అట్లీ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు..

Shah Rukh Khan: అట్లీ -షారుక్ ఖాన్ సినిమాకు పనిచేయనున్న ఆ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్..!
Atlee
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 09, 2021 | 11:58 AM

Atlee: చేసినవి తక్కువ సినిమాలే అయినా స్టేర్ డైరెక్టర్‌గా మారిపోయాడు అట్లీ. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా మారిన అట్లీ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా భారీ సినిమాలను తెరకెక్కించి విజయాలను అందుకున్నాడు. దళపతి విజయ్‌‌‌తో భారీ సినిమాలను రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్స్‌‌‌ను అందుకున్నాడు. అయితే దళపతితో తెరకెక్కించిన బిగిల్ సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు దాటిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేయలేదు అట్లీ. ఈ క్రమంలోనే అట్లీకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఏకంగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌ను డైరక్ట్ చేసే అవకాశాన్ని పట్టేసాడు ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ప్రస్తుతం షారుఖ్ పఠాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత షారుఖ్ అట్లీతో సినిమా ఉండనుంది. షారుక్ కోసం ఓ అదిరిపోయే కథను సిద్ధంచేశాడు అట్లీ.

ఈ ప్రాజెక్ట్ కొన్ని రోజుల క్రితం పూణేలో ప్రారంభమైంది.  ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా దళపతి విజయ్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడని అంటున్నారు. విజయ్ కనిపించేది కొద్దిసేపే అయినా అదిరిపోతుంది అంటున్నారు. ఇక టాలీవుడ్ హీరో రానా కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని అంటున్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మరో మ్యూజిక్ డైరెక్టర్ అందించనున్నాడట.. అతను ఎవరో కాదు యువ సంచలనం అనిరుధ్ రవిచందర్. ఇలా ఈ సినిమాను ఇద్దరు సూపర్ కంపోజర్స్ పనిచేయనున్నారని తెలుస్తుంది. నయనతార- ప్రియమణి- సన్యా మల్హోత్రా- సునీల్ గ్రోవర్ -యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నా ఈ సినిమాలో షారుక్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections 2021: ముదురుతున్న మా వివాదం.. మోహన్ బాబుకు మాత్రమే చెప్తానంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు..

Telangana High Court: ఆ వినాయకులకు అక్కడ అనుమతి లేదు.. గణేశ్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు..