Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ను కంగారెత్తిస్తోన్న గేమ్‌.. పోలీసులను ఆశ్రయించిన కండల వీరుడు

సల్మాన్‌ ఖాన్‌ అంటే రెండే రెండు ఘటనలు గుర్తుకొస్తాయి. ఒకటి కృష్ణజింకలను వేటాడిన కేసు.. ఇంకోటి ఫుట్‌పాత్‌

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ను కంగారెత్తిస్తోన్న గేమ్‌.. పోలీసులను ఆశ్రయించిన కండల వీరుడు
Salman Khan
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 08, 2021 | 5:40 PM

Salman Khan – Selmon Bhoi – Video Game: సల్మాన్‌ ఖాన్‌ అంటే రెండే రెండు ఘటనలు గుర్తుకొస్తాయి. ఒకటి కృష్ణజింకలను వేటాడిన కేసు.. ఇంకోటి ఫుట్‌పాత్‌పై జనాలను కారుతో తొక్కించేసిన కేసు. ఇప్పుడు ఓ కొత్త గేమ్‌ సల్మాన్‌ను ఇబ్బందిపెడుతోంది. ఇంతకీ ఆ కేసులకు ఈ గేమ్‌కి సంబంధమేంటి?

సల్లూభాయ్‌ అంటే బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ షేక్ అవ్వాల్సిందే. అతడి సినిమా వస్తుందంటే అటు ఫ్యాన్స్‌లో ఇటు సినీ ట్రేడ్‌లో పండగ వాతావరణమే ఉంటుంది. అంతటి స్టామినా ఉన్నోడు సల్మాన్‌ ఖాన్‌. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదల చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతుంటాడు. సినిమాల్లోనే కాదు బయట కూడా సల్లూభాయ్‌ వ్యవహారశైలి అంతే రఫ్‌గా ఉంటుంది. ఎవడైతే నాకేంటి యాటిట్యూడ్‌ కనిపిస్తుంది. అలాంటి సల్మాన్‌ ఖాన్‌ ఓ చిన్న గేమ్‌ చూసి భయపడుతున్నాడు.

తన రెప్యుటేషన్‌కే భంగం కలుగుతున్నట్లు భయపడుతున్నాడు. అదే సల్లూ భాయ్‌. అప్పట్లో ఫుట్‌పాత్‌ పై పడుకున్న కొంత మందిని యాక్సిడెంట్ చేసాడని హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. దాంతో పాటు రాజస్థాన్‌లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో కూడా సల్మాన్ ఖాన్ అప్పట్లో కొన్ని రోజులు జైలు జీవితం గడిపాడు. అంతేకాదు ఒకవైపు వివాదాలు.. మరోవైపు హీరోయిన్స్‌తో ఎఫైర్స్‌తో సల్మాన్ వార్తల్లో నిలిచేలా చేసాయి. అయితే కొంత మంది మొబైల్ గేమ్ నిర్వాహకులు సల్మాన్ హిట్ అండర్ రన్ కేసు నేపథ్యంలో ఓ పేరడీ వీడియో గేమ్‌ను రూపొందించారు.

‘సెల్మోన్ భాయ్’ పేరుతో రెడీ చేసిన ఈ వీడియో గేమ్‌ పబ్లిక్‌లో కూడా మస్తు పాపులర్ అయింది. ఈ వీడియో గేమ్ తన ప్రతిష్ఠకు భంగం కలిగించే రీతిలో ఉందని సల్మాన్ ఖాన్ ముంబైలోని సివిల్ కోర్టులో దావా వేశారు. ఈ వీడియో గేమ్‌తో పేరడీ స్టూడియోస్ వాళ్లు ఎంతో లాభపడ్డారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా ముంబైలోని సివిల్ కోర్టు సల్మాన్ ఖాన్ పై రూపొందించిన పేరడీ వీడియో గేమ్ ‘సెల్మోన్ భాయ్’ తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Read also: Vinayaka Chaturthi: రాయదుర్గంలో 14వ శతాబ్దం నాటి దశభుజ గణపతి. టెంకాయ స్వామి దగ్గర ఉంచితే..