RC15: అయ్య బాబోయ్.. ఒక్క పోస్టర్ కే ఇంత ఖర్చా ? అంచనాలు పెంచేస్తోన్న శంకర్-చరణ్ సినిమా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్‏తోపాటు.

RC15: అయ్య బాబోయ్.. ఒక్క పోస్టర్ కే ఇంత ఖర్చా ? అంచనాలు పెంచేస్తోన్న శంకర్-చరణ్ సినిమా..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 09, 2021 | 9:16 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్‏తోపాటు.. జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ తర్వాత చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. RC15 అనే వర్కింగ్ టైటిల్‏తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో రాబోతున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‏గా నటిస్తుంది.

అయితే నిన్న ఈ మూవీకి పూజా కార్యక్రమాలను నిర్వహించి.. ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు చిరంజీవి, రాజమౌళితోపాటు.. బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్ కూడా హజరయ్యారు. అయితే ఈ పూజా కార్యక్రమానికి సంబంధించి.. ఓ కాన్సెప్ట్ పోస్టర్‏ను పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందులో డైరెక్టర్ శంకర్‏తోపాటు.. మొత్తం కాస్ట్ అండ్ క్రూడ్ టీం అంతా ఇందులో కనిపిస్తున్నారు. అందరూ షూట్స్ ధరించి… చేతిలో ఫైల్స్ పట్టుకుని స్టైలీష్‏గా నడుస్తూ వస్తున్న ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. అయితే ఎప్పుడు భారీ బడ్జెట్ సినిమాలే తెరకెక్కించే శంకర్.. ఈ సినిమాకు కూడా దాదాపు రూ.250 కోట్లు కేటాయించినట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ గురించి నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ పోస్టర్ డిజైన్ కోసం ఏకంగా కోటి 73 లక్షలు రూపాయాలు ఖర్చు పెట్టినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కేవలం ఒక్క పోస్టర్‍కే ఇంత ఖర్చు పెడితే.. ఇక సినిమాకు ఎంత ఖర్చు పెడతారో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

Also Read: Tollywood Drugs Case: టాలీవుడ్‏ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు.. ఈరోజు ఈడీ ముందుకు రవితేజ..

Nayantara: పెళ్లి తర్వాత కూడా నయన్ సినిమాల్లో నటిస్తుందా ? లేడీ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!