Tollywood Drugs Case: టాలీవుడ్‏ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు.. ఈరోజు ఈడీ ముందుకు రవితేజ..

డ్రగ్స్ కొనుగోళ్లు... మనీ లాండరింగ్ కేసులు టాలీవుడ్ చిత్రపరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.

Tollywood Drugs Case: టాలీవుడ్‏ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు.. ఈరోజు ఈడీ ముందుకు రవితేజ..
Raviteja

డ్రగ్స్ కొనుగోళ్లు… మనీ లాండరింగ్ కేసులు టాలీవుడ్ చిత్రపరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తూ.. హీట్ పెంచుతున్నారు అధికారులు. ఇప్పటికే పూరీ, రకుల్, చార్మీ, రానాదగ్గుబాటిలను ఈడీ ఆధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అందులో వారి బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలతోపాటు… మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ ప్రశ్నిస్తోంది. ఈరోజు(సెప్టెంబర్ 9న) మాస్ మాహరాజా రవితేజ్ ఈజీ ముందు హాజరుకానున్నారు. మాస్ మాహరాజాపై ప్రశ్నలను సంధించేందుకు ఈడీ సర్వం సిద్ధం చేసుకుంది. ఇందులో కెల్విన్‏కు, రవితేజాకు మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నించే అవకాశముంది. అలాగే డ్రగ్స్ కొనుగోల్ల కోసం లావదేవిలు జరిపారా ? కెల్విన్ ఖాతాకు మనీ ట్రాన్స్‏ఫర్ చేశారా ? ఎప్ క్లబ్‏తో సంబంధాలు ఉన్నాయా ? అనే కోణంలో ఈడీ విచారణ జరపనుంది.

అలాగే రవితేజకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతోపాటు.. అనుమానాస్పద లావిదేవీలపై కూడా ఈడీ దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు ఈడీ అధికారులు.. పూరీ చార్మి, రకుల్, నందులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను, లావాదేవిలకు సంబంధించిన పూర్తి అంశాలను పరిషిలించినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోల్లు, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలతో హీరో రానాను దాదాపు 7 గంటలకు పైగా విచారించింది ఈడీ. రానాతోపాటు డ్రగ్ పెడలర్ కెల్విన్‏ను కూడా ఈడీ ప్రశ్నించింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలపై ఈడీ కూపీ లాగింది. అలాగే డ్రగ్స్ కొనుగోలు కోసం వీరిద్దరి మధ్య లావాదేవీలు జరిగాయా? అని పరిశిలించింది ఈడీ. ఇక మరికాసేపట్లో ఈడీ ముందుకు రవితేజ.. ఆయన కార్ డ్రైవర్ హాజరుకానున్నారు.

Also Read: Nayantara: పెళ్లి తర్వాత కూడా నయన్ సినిమాల్లో నటిస్తుందా ? లేడీ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 5 Telugu: యాంకర్‌ రవి బిగ్‌బాస్‌ షో కోసం వారానికి అంత తీసుకుంటున్నాడా.? క్రేజ్‌ మాములుగా లేదుగా..

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్‏కు సేవలు చేసిన లోబో.. ప్రతీకారం తీర్చుకుంటానంటూ ప్రతిజ్ఞ..

Click on your DTH Provider to Add TV9 Telugu