Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayantara: పెళ్లి తర్వాత కూడా నయన్ సినిమాల్లో నటిస్తుందా ? లేడీ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్..

దక్షిణాది చిత్రపరిశ్రమలోనే టాప్ హీరోయిన్‎గా కొనసాగుతుంది నయనతార. స్టార్ హీరోలకు పోటీగా నటిస్తూ.. సౌత్ లేడీ సూపర్ స్టార్‏గా మారిపోయింది నయన్.

Nayantara: పెళ్లి తర్వాత కూడా నయన్ సినిమాల్లో నటిస్తుందా ? లేడీ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్..
Nayan
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 09, 2021 | 8:11 AM

దక్షిణాది చిత్రపరిశ్రమలోనే టాప్ హీరోయిన్‎గా కొనసాగుతుంది నయనతార. స్టార్ హీరోలకు పోటీగా నటిస్తూ.. సౌత్ లేడీ సూపర్ స్టార్‏గా మారిపోయింది నయన్. ప్రస్తుతం ఈ అమ్మడు.. తెలుగు, తమిళ్ భాషలలో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటోంది. ఇక ఇటీవల నయన్ పెళ్లి గురించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‏చల్ చేస్తున్నాయి. త్వరలోనే ఈ అమ్మడు.. తన ప్రియుడు విఘ్నేశ్ శివన్‏ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. గత అయిదేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. ఇటీవలే వీరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలకు బలం చేకూరుస్తూ… నయన్ ఈ మధ్యే ఓ షోలో పాల్గోని.. తన వేలి ఉంగరం చూపిస్తూ.. తనకు స్పెషల్ అని చెప్పుకొచ్చింది. దీంతో నయన్, విఘ్నేష్ శివన్ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ చర్చ జరుగుతుంది. అయితే మరోవైపు.. నయన్ పెళ్లి తర్వాత నటిస్తుందా ? లేదా ? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత దశాబ్ధకాలంగా తెలుగు, తమిళ్ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‏గా రాణిస్తున్న నయన్.. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తుంది.

గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది నయన్. అయితే సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన్.. పెళ్లి తర్వాతా నటిస్తుందా లేదా అనే సందేహాలు ఎక్కువవుతుండడంతో నయన్ తన పెళ్లి పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్లి తర్వాత కూడా తాను నటిస్తానని.. నటనను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేసినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అటు విఘ్నేష్ సైతం పెళ్లి తర్వాత నయన్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. వారి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నయన్. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తోంది. అలాగే విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న కాతువాకుల రెండు ఖాదల సినిమా చేస్తుంది. మరోవైపు.. అట్లీ, షారుఖ్ ఖాన్ కలయికలో వస్తున్న సినిమాలో నటిస్తుంది.

Also Read: Bigg Boss 5 Telugu: యాంకర్‌ రవి బిగ్‌బాస్‌ షో కోసం వారానికి అంత తీసుకుంటున్నాడా.? క్రేజ్‌ మాములుగా లేదుగా..

బిగ్ బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే.? హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.!