Coronavirus Updates: భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు..
Covid-19 Cases in India: భారత్‌లో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్
Covid-19 Cases in India: భారత్‌లో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్‌వేవ్ ప్రమాదం పొంచివుందని జాగ్రత్తలు పాటించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో రోజువారీ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 43,263 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 338 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India reports 43,263 new #COVID19 cases, 40,567 recoveries & 338 deaths in last 24 hours, as per Union Health Ministry.
Total cases: 3,31,39,981 Active cases: 3,93,614 Total recoveries: 3,23,04,618 Death toll: 4,41,749
Total vaccinations: 71,65,97,428 (86,51,701 in last 24 hrs) pic.twitter.com/u9pEV1CyRG
— ANI (@ANI) September 9, 2021
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,31,39,981 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,41,749 చేరింది. నిన్న కరోనా నుంచి 40,567 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,23,04,618 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,93,614 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కాగా.. దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాల్లో 80 శాతానికి పైగా కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. బుధవారం కేరళలో 30,196 కరోనా కేసులు నమోదు కాగా.. 181 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ 71 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 71,65,97,428 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 86,51,701 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.
Also Read: