Private Hospital: వామ్మో ఇంత బిల్లా..? ఢిల్లీలో కోవిడ్ రోగికి రూ.1.8కోట్ల బిల్లు.. చర్యలకు కాంగ్రెస్ డిమాండ్
Covid treatment bill: కరోనా ప్రారంభం నాటినుంచి ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి భారీగా దండుకున్న అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రోగుల చికిత్సకు రూ.లక్షలు,
Covid treatment bill: కరోనా ప్రారంభం నాటినుంచి ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి భారీగా దండుకున్న అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రోగుల చికిత్సకు రూ.లక్షలు, కోట్లు వసూలు చేశాయి. బిల్లు కట్టనిదే.. కనీసం శవాలను కూడా ఇవ్వలేదు. అయితే.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి కోవిడ్ చికిత్సకు రోగి నుంచి రూ.1.8 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ విషయం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయాకు ఓ లేఖ రాశారు. ఇలాంటి సంఘటనలను నియంత్రించేందుకు అధికారులను నియమించాలని, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోగి నుంచి ఆసుపత్రి యాజమాన్యం ఇంత భారీ మొత్తంలో ఎలా వసూలు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంతమేర చికిత్స అందించినా.. 1.8 బిల్లు ఎలా అవుతుందంటూ పేర్కొన్నారు. ఇలాంటివి నియంత్రించేందుకు ప్రభుత్వం ఓ బిల్లును తీసుకురావాలంటూ మనీష్ తివారీ ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయాను కోరారు. అంతేకాకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కోరారు.
ఆమ్-ఆద్మీ పార్టీ మాళవ్య నగర్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి సోమవారం మాక్స్ హాస్పిటల్‌పై పలు ఆరోపణలు చేశారు. సాకేత్‌లోని మాక్స్‌లో నాలుగు నెలల నుంచి కోవిడ్ చికిత్స పొందిన రోగికి 1.8 కోట్ల బిల్లు వేశారని ఆరోపించారు. ఆ రోగి ఏప్రిల్ నెలాఖరులో కోవిడ్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరి ఎంత చికిత్స అందించినప్పటికీ.. ఇంతలా బిల్లు వేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా.. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. కోవిడ్ రోగి టైప్ -2 డయాబెటిక్, హైపర్‌టెన్సివ్, పిత్తాశయం ఇన్ఫెక్షన్, మెదడు పనితీరు క్షీణించడం వంటి బహుళ సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు సవాలుగా మారిందని.. అందుకే అంతమేర ఖర్చయినట్లు ఆసుపత్రి పేర్కొంది. Also Read: