Crime News: ఆ అమ్మాయిని రేప్ చేస్తా.. ఆన్‌లైన్‌ క్లాసులో గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపులు.. ఆపై అసభ్యకరంగా..

Online Class: కరోనావైరస్ విజృంభణ అనంతరం విద్యారంగంలో పూర్తిగా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలా కాళాశాలలు, పాఠశాలల్లో ప్రత్యేక్ష బోధన కాకుండా.. ఆన్‌లైన్‌ పద్ధతిలో బోధనలు

Crime News: ఆ అమ్మాయిని రేప్ చేస్తా.. ఆన్‌లైన్‌ క్లాసులో గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపులు.. ఆపై అసభ్యకరంగా..
Online Class
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 09, 2021 | 7:00 AM

Online Class: కరోనావైరస్ విజృంభణ అనంతరం విద్యారంగంలో పూర్తిగా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలా కాళాశాలలు, పాఠశాలల్లో ప్రత్యేక్ష బోధన కాకుండా.. ఆన్‌లైన్‌ పద్ధతిలో బోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ కళాశాల సైతం త‌మ విద్యార్థుల‌కు జూమ్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ క్లాసులు జ‌రుగుతుండ‌గా ఒక్కసారిగా ఓ అగంత‌కుడు ఆ క్లాసులోకి చొరబడ్డాడు. అనంతరం ఓ విద్యార్థినిని రేప్ చేస్తాన‌ంటూ బెదిరించాడు. అంతే కాకుండా ఆ లక్చరర్‌ వ‌ర‌స్ట్ అంటూ కామెంట్లు సైతం పెట్టాడు. ఈ క్రమంలో ఏం జరుగుతోందో అర్ధం కాక అటు విద్యార్థులు, లెక్చరర్లు ఒక్కసారిగా భయపడ్డారు. దీనిపై కళాశాల యాజమాన్యం హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా ప‌రిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌ పరిధిలోని నాచారం ప్రాంతంలోని ఓ కళాశాల.. తమ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఈ మేరకు జూమ్ క్లాస్‌లకు సంబంధించిన పాస్‌వ‌ర్డ్‌ను యాజ‌మాన్యం విద్యార్థుల‌కు వాట్సప్‌ ద్వారా షేర్‌ చేసింది. క్లాస్‌లు నిర్వహిస్తున్న అకస్మాత్తుగా ఓ గుర్తు తెలియ‌ని వ్యక్తి ఆన్‌లైన్‌లోకి ప్రవేశించాడు. ఓ విద్యార్థిని పేరును వ్యాఖ్యానిస్తూ.. ఆమెను రేప్ చేస్తాన‌ంటూ బెదిరించాడు. దీంతోపాటు ఆ యువ‌తికి అసభ్యకరమైన మెస్సేజ్‌లు సైతం పంపాడు. దీంతో విస్తుపోయిన కాలేజీ యాజ‌మాన్యం.. ఆ మ‌రుస‌టి రోజు పాస్ వ‌ర్డ్‌ను మార్చేసింది.

అయినప్పటికీ.. ఆగంత‌కుడు ఆగ‌లేదు. మ‌ళ్లీ వారి ఆన్‌లైన్ క్లాసుల్లో చొర‌బ‌డి అసభ్యంగా ప్రవర్తించాడు. కళాశాల లెక్చరర్‌ జీమెయిల్‌ను హ్యాక్ చేసి దాని ద్వారా ప‌లువురికి అసభ్యకరమైన సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఫలానా టీచ‌ర్ వ‌ర‌స్ట్ అంటూ కామెంట్లు పెట్టాడు. దీంతో విసిగిపోయిన యాజమాన్యం.. రాచ‌కొండ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న సైబర్‌ క్రైం పోలీసులు ఆగంతకుడిని పట్టుకునేందుకు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read:

Arjun Singh: బీజేపీ ఎంపీ ఇంటిపై నాటు బాంబులతో దాడి.. బెంగాల్‌లో శాంతి భద్రతలపై గవర్నర్ ఆందోళన..

Sasikala Property: అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో షాక్.. రూ.100 కోట్ల ఆస్తులు జప్తు