Sasikala Property: అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో షాక్.. రూ.100 కోట్ల ఆస్తులు జప్తు

అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు చిన్నమ్మకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులను బినామీ చట్టం కింద ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది.

Sasikala Property: అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో షాక్.. రూ.100 కోట్ల ఆస్తులు జప్తు
Vk Sasikala
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 08, 2021 | 4:48 PM

IT attaches Sasikala’s property: అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు చిన్నమ్మకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులను బినామీ చట్టం కింద ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది. దివంగత జయలలిత ఇష్టసఖి శశికళకు ఆదాయపు పన్నుశాఖ మరోసారి షాకిచ్చింది. బినామీ చట్టం కింద శశికళ ఆస్తులను ఐటీ శాఖ సీజ్‌ చేసింది. పనయూర్‌లో శశికళకు చెందిన 49 ఎకరాల భూమి అటాచ్‌మెంట్‌ చేసింది. రూ.100 కోట్ల విలువైన భూమిని అటాచ్‌ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

చిన్నమ్మకు ఐటీ శాఖ వరుసగా షాక్‌లు ఇస్తోంది కొద్దిరోజుల క్రితమే ఆమెకు పన్ను మినహాయింపు వర్తించదని ఝలక్‌ ఇచ్చింది. తాజాగా ఐటీ డిపాజిట్ ఆస్తుల నిరోధక చట్టం కింద శశికళ ఆస్తులను జప్తు చేశామని వెల్లడించారు. ఇప్పటికే శశికళకు చెందిన రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ ఇప్పటికే జప్తు చేసింది. జైలు శిక్ష పడిన వ్యక్తికి ఐటీ బకాయిల్లో మినహాయింపు వర్తించదని ఐటీ వర్గాలు కోర్టుకు స్పష్టం చేశాయి. 2008లో ఏసీబీ సమర్పించిన నివేదిక మేరకు ఆస్తులకు సంబంధించి రూ. 48 లక్షలు పన్ను చెల్లించాలని ఐటీ వర్గాలు చిన్నమ్మను ఆదేశించాయి. దీనిని వ్యతిరేకిస్తూ ఐటీ ట్రిబ్యునల్‌ను శశికళ ఆశ్రయించారు. ఆ పన్ను చెల్లింపు నుంచి గట్టెక్కారు.

అయితే, ట్రిబ్యునల్‌ తీర్పును వ్యతిరేకిస్తూ ఐటీ వర్గాలు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాయి. బినామీ చట్టం కింద శశికళకు చెందిన చాలా ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ సీజ్‌ చేసింది. చెన్నైలో జయలలిత పోయెస్‌ గార్డెన్‌ నివాసం ఎదుట శశికళ నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. మన్నార్‌గుడితో పాటు పలు ప్రాంతాల్లో ఆమె కొన్న విలువైన ఆస్తులను కూడా స్వాథీనం చేసుకున్నారు. శశికళతో పాటు ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌ ఆస్తులను కూడా ఐటీ శాఖ సీజ్‌ చేసింది. అక్రమ ఆస్తుల కేసులో జైలుశిక్ష అనుభవించిన శశికళ బెంగళూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అన్నాడీఎంకే వర్గాలు శశికళను దగ్గరకు రానివ్వడం లేదు. కొద్దిరోజుల క్రితం మాజీ డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంకు సతీవియోగం కావడంతో ఆమె వెళ్లి పరామర్శించారు.

Read Also…  Debit Cards: ఇంటర్నెట్‌ లేకున్నా డెబిట్‌ కార్డు వాడవచ్చు.. అందుబాటులోకి రానున్న కొత్త టెక్నాలజీ..!

Guess The Hero: ఈ ఫొటో రౌండప్‌లో ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడాయన ఓ క్రేజీ హీరో.