Debit Cards: ఇంటర్నెట్‌ లేకున్నా డెబిట్‌ కార్డు వాడవచ్చు.. అందుబాటులోకి రానున్న కొత్త టెక్నాలజీ..!

Debit Cards: ప్రస్తుతం డెబిట్‌ కార్డులు గానీ.. క్రెడిట్‌ కార్డులు కానీ స్వైపింగ్‌ చేయాలంటే ఇంటర్నెట్‌ తప్పనిసరి. నెట్‌ వర్క్‌ సరిగ్గా ఉంటేనే డెబిట్‌కార్డు ద్వారా లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. మనం అత్యవసర..

Debit Cards: ఇంటర్నెట్‌ లేకున్నా డెబిట్‌ కార్డు వాడవచ్చు.. అందుబాటులోకి రానున్న కొత్త టెక్నాలజీ..!

Debit Cards: ప్రస్తుతం డెబిట్‌ కార్డులు గానీ.. క్రెడిట్‌ కార్డులు కానీ స్వైపింగ్‌ చేయాలంటే ఇంటర్నెట్‌ తప్పనిసరి. నెట్‌ వర్క్‌ సరిగ్గా ఉంటేనే డెబిట్‌కార్డు ద్వారా లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. మనం అత్యవసర సమయాల్లో డబ్బులు డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు మెషీన్లో ఇంటర్నెట్ తప్పనిసరి అవసరం. ఒకవేళ మన ప్రాంతంలో ఇంటర్నెట్ లేకపోతే ఆ సమయాల్లో మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి సమయంలో కార్డును ఉపయోగించడం వీలు కాదు. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త టెక్నాలజీ  అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీ సహాయంతో మనం ఉన్న ప్రాంతంలోనే డెబిట్ కార్డు ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుంది. ఈ  దిశగా వీసా సంస్థ పనిచేస్తుంది. మనకు అందించే చిప్ ఆధారిత వీసా డెబిట్ కార్డు ద్వారా ఇంటర్నెట్ లేకున్నా ప్రతి రోజు రూ.2 వేల వరకు లావాదేవీలు జరపవచ్చు.

డెబిట్ కార్డులో రోజువారీ ఖర్చు పరిమితి రూ.2 వేలు

ఇప్పటికే పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ ఇన్నోవిటి భాగస్వామ్యంతో వీసా ఆఫ్‌లైన్‌ చెల్లింపుల కోసం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్(పీఓసీ) పద్దతిలో ఒక డెబిట్ కార్డు రూపొందించింది. ఈ పీఓసీ కార్డును యస్ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్ మార్కెట్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రీపెయిడ్ కార్డుల ఇతర వాటి కంటే భిన్నంగా ఉంటాయి. ఇవి నెట్‌వర్క్‌ క్లౌడ్ ఆధారంగా పనిచేస్తాయి. ఈ కొత్త వీసా చిప్ డెబిట్ కార్డులో రోజువారీ ఖర్చు పరిమితి రూ.2 వేలు. ప్రతి లావాదేవీ పరిమితి కూడా రూ.200 మాత్రమే అని ఆర్‌బీఐ వెల్లడించింది. ఒకవేళ తగిన బ్యాలెన్స్ లేకపోతే లావాదేవీని తిరస్కరిస్తారు.

ఈ డెబిట్ కార్డు బ్యాంకు ఖాతాదారులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఇంటర్నెట్ లేని సమయాల్లో వర్తకులతో ఇబ్బందులు రాకుండా ఎంతగానో సహాయపడుతుంది. వీసా ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీని మొట్టమొదటి సారిగా మనదేశంలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఎక్కువ శాతం డిజిటల్ లావాదేవీలు ఇంటర్నెట్ లేని కారణంగా ఫెయిల్ అవుతున్నట్లు గతంలో ఆర్‌బీఐ తెలిపింది. ఆ సమస్యకు పరిష్కారంగా ఈ కొత్త టెక్నాలజీ వీసా తీసుకోని వస్తుంది. కోవిడ్ మహమ్మారి రాకతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. అందుకే వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేలా బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. ఇలాంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తే వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి.

కాగా, ప్రస్తుత చాలా ప్రాంతాల్లో డిబిట్‌ కార్డు ద్వారా లావాదేవీలు జరపాలంటే సరైన నెట్‌ వర్క్‌ లేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీంతో వినియోగదారుల సమయం వృధా కావడమే కాకుండా మిగతా వారు కూడా లావాదేవీలు జరిపేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సరైన ఇంటర్నెట్‌ సదుపాయం లేక లావాదేవీలకు సంబంధించి వివరాలు నమోదు చేసిన తర్వాత ఫెయిల్‌ అయినట్లు రావడం ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి ఇబ్బందులపై రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)కి ఎన్నో ఫిర్యాదులు అందాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నెట్‌వర్క్‌తో పని లేకుండా డెడిట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవీ కూడా చదవండి:

LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్ వాడే వారికి శుభవార్త.. కొత్త నిబంధనలు అమల్లోకి..

GST Tax Payers: పన్ను చెల్లింపుదారులకు షాకిచ్చిన కేంద్ర సర్కార్‌.. సెప్టెంబరు 10లోగా దాఖలు చేయండి

 

Click on your DTH Provider to Add TV9 Telugu