LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్ వాడే వారికి శుభవార్త.. కొత్త నిబంధనలు అమల్లోకి..
LPG Gas Cylinder: మీరు గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ వాడే వారికి ఊరట కలుగనుంది. కొత్త రూల్స్ ప్రకారం..
LPG Gas Cylinder: మీరు గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ వాడే వారికి ఊరట కలుగనుంది. కొత్త రూల్స్ ప్రకారం.. మీకు నచ్చిన గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్‌కు మీరు మారవచ్చు. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొంత మంది సిలిండర్ బుక్ చేసి చాలా రోజులు అయినా కూడా సిలిండర్ ఇంటికి రాదు. ఇలాంటి వారు ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. వారి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌ను మార్చుకోవచ్చు. వేరే డిస్ట్రిబ్యూటర్ నుంచి సిలిండర్ పొందే వెసులుబాటు ఉంటుంది. ఇలా నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి సిలిండర్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి గ్యాస్ సిలిండర్ పొందవచ్చని తెలిపింది. మీ డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకొని గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా సులభంగా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
వినియోగదారులకు మరిన్ని సదుపాయాలు అందించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కాగా, ఇటీవల ఇలాంటి సేవలు దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ సర్వీసులను పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది పెట్రోలియం శాఖ. ఛండీఘర్, కోయంబత్తూరు, గురుగావ్, రాంచీలలో ఈ సేవలు పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్యాస్ సిలిండర్ వినియోగదారులు వారి మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు.. వారి ఇంటికి సిలిండర్ డెలివరీ చేసే డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్ కనిపిస్తుంది. వారి పనితీరు రేటింగ్ కూడా కనిపిస్తుంది. ఇందులో కస్టమర్లు వారికి నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకోవచ్చు. వారే మీ ఇంటికి సిలిండర్ డెలివరీ చేస్తారు.
Choose your #Indane distributor for refill delivery!
Avail the refill portability option when booking your refill through IndianOil One app or https://t.co/EUYfUjktKB to choose your preferred #Indane distributor based in your area, every time you book your refill ! pic.twitter.com/WduZdSvPBE
— Indian Oil Corp Ltd (@IndianOilcl) September 7, 2021