Punjab National Bank: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా? ఇవి తప్పకుండా తెలుసుకోండి.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు
Punjab National Bank: బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ కూడా ఎన్నో మార్పులను చేస్తోంది. అలాగే కొన్ని..
Punjab National Bank: బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ కూడా ఎన్నో మార్పులను చేస్తోంది. అలాగే కొన్ని బ్యాంకులు కూడా విలీనమైపోయాయి. ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లను ముందస్తుగానే అప్రమత్తం చేసింది సదరు బ్యాంకులు. ఇక దేశీ ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) వినియోగదారులను అలర్ట్ చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయని బ్యాంకు తెలిపింది. దీంతో పాత చెక్‌బుక్స్ పని చేయవని సదరు బ్యాంకు వెల్లడించింది.
ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (OBC), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ బుక్స్ చెల్లవని పీఎన్‌బీ వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అందుకే ఈ బ్యాంకుల వినియోగదారులు కొత్త చెక్ బుక్‌లను పొందాలని కోరింది. లేదంటే చెక్ బుక్ ట్రాన్సాక్షన్లు నిలిచిపోతాయని తెలిపింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కొత్త చెక్‌బుక్స్‌ను తీసుకోవడం బెటర్.
అలాగే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమైన విషయం కస్టమర్లకు తెలిసిందే. అందువల్ల పీఎన్‌బీ నుంచి కస్టమర్లు కొత్త చెక్ బుక్స్ పొందాల్సి ఉంటుంది. వీటిల్లో ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ వంటివి కొత్తవి ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
పైన తెలిపిన రెండు బ్యాంకుల వినియోగదారులు వారి పాత చెక్ బుక్స్‌ను కొత్త చెక్ బుక్స్‌తో మార్చుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నెల చివరిలోపు కొత్త చెక్ బుక్స్ పొందాలి. లేదంటే అక్టోబర్ 1 నుంచి పాత చెక్ బుక్స్ చెల్లవు. ఏదైనా సందేహాలుంటే18001802222 నెంబర్‌కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని బ్యాంకు సూచించింది.
కాగా, గత సంవత్సరం ఏప్రిల్ 1న ఓరియెంటల్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (PNB)లో విలీనం అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు బ్యాంకుల పనులన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంకు కింద జరుగుతున్నాయి. దీని ప్రకారం.. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కూడా మారిపోయాయి. ఈ రెండు బ్యాంకుల కోడ్‌లు ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకు కోడ్‌తో కొనసాగనున్నాయి. ఈ విషయాలన్ని కస్టమర్ల తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అక్టోబర్ 1 తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
Take note & apply for your new cheque book through?
➡️ ATM ➡️ Internet Banking ➡️ PNB One ➡️ Branch pic.twitter.com/OEmRM1x6j0
— Punjab National Bank (@pnbindia) September 8, 2021