Sachin in tiger park Video: తాడోబా పులుల సఫారీ పర్యటనలో సచిన్..!సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
క్రికెట్ ఐకాన్ సచిన్ తెందుల్కర్‌లో మరో కోణం కూడా ఉంది. అటవీ జంతువులన్నా ముఖ్యంగా పులుల పట్ల ఎంతో అభిమానం చూపిస్తుంటారు. తాజాగా నాగ్‌పూర్‌లోని తాడోబా టైగర్ రిజర్వ్ పార్క్‌లో తన కుటుంబసభ్యులతో పర్యటించారు. గతంలో పులులతో గడిపిన క్షణాలను వీడియో తీసి...
క్రికెట్ ఐకాన్ సచిన్ తెందుల్కర్‌లో మరో కోణం కూడా ఉంది. అటవీ జంతువులన్నా ముఖ్యంగా పులుల పట్ల ఎంతో అభిమానం చూపిస్తుంటారు. తాజాగా నాగ్‌పూర్‌లోని తాడోబా టైగర్ రిజర్వ్ పార్క్‌లో తన కుటుంబసభ్యులతో పర్యటించారు. గతంలో పులులతో గడిపిన క్షణాలను వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేయగా లైక్‌లు షేర్‌లతో దూసుకుపోయింది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా తాడోబా అభయారణ్యంలో క్రికెట్ ఐకాన్ సచిన్ తెందుల్కర్ సకుటుంబ సమేతంగా పర్యటించారు. ఈ నెల 4న భార్య అంజలి, సోదరి, మరో మాజీ క్రికెటర్ ప్రశాంత్ వైద్య, ఇతర మిత్రులతో కలసి, ముంబై నుంచి నాగ్‌పూర్ విమానాశ్రయం చేరుకుని.. ఇక్కడి రిసార్ట్స్‌లో బస చేశారు.
అటవీ జంతువుల పట్ల ఎంతో అభిమానం చూపించే సచిన్ అంతకుముందు రెండుసార్లు తాడోబా అంధారి టైగర్ రిజర్వ్‌కు వచ్చారు. తొలిసారిగా 2020 జనవరి 26న భార్య అంజలి, కుమారుడు అర్జున్‌తో, ఈ ఏడాది జనవరి 26న తన తల్లి, మిత్రులతో వచ్చారు. సోమవారం సాయంత్రం పర్యటనకు బయలుదేరిన సచిన్ దంపతుల వెంట అటవీశాఖ అధికారులు ఉన్నారు. సచిన్ తాడోబా పులుల అభిమాని అని అధికారులు తెలిపారు. ప్రపంచ అటవీ జంతువుల దినోత్సవం 2021 సందర్భంగా , తాడోబా అభయారణ్యంలో పులులతో గడిపిన క్షణాలను వీడియోగా తీసిన సచిన్ గతంలో ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వీడియోకు లైక్‌లు షేర్‌లు వెల్లువెత్తాయి. వీడియోలో తాడోబా పర్యటన విశేషాలను సచిన్ డీటైల్డ్‌గా వివరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video : వెంట్రుకవాసిలో చావునుంచి తప్పించుకున్నారు..!వీడియో చుస్తే అలానే ఉంది మరి..
Taliban: అఫ్గాన్ పౌరులకు ఎనలేని కష్టాలు.. తాలిబన్ల చెరలో విమానాలు..!విమానంలో అందరూ వాళ్ళే(వీడియో)
Technology Video: ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు.. ఎడారిలో మంచినీరు తయారుచేసే రోబో.. (వీడియో)
Know This video: ఇదేం.. ఎస్కేప్ సామీ.!చెంచాలతో సొరంగం తవ్వి జైల్ నుంచి పరార్(వీడియో).