Floods in Warangal Video: తోపుడు బండే అంబులెన్స్.. ఓరుగల్లు వరద కష్టాలు.. జలమయంలో 82 కాలనీలు(వీడియో)
వరద బీభత్సానికి చిన్నపాటి కాలువలు సైతం ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మీరు చూస్తున్న ఈ విజువల్స్.. ఎక్కడో మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ఏరియాలోనిదో కాదు..తెలంగాణ రెండో రాజధానిగా చెప్పుకునే వరంగల్ పట్టణంలో కనిపించిన జల విలయం..
వరద బీభత్సానికి చిన్నపాటి కాలువలు సైతం ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మీరు చూస్తున్న ఈ విజువల్స్.. ఎక్కడో మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ఏరియాలోనిదో కాదు..తెలంగాణ రెండో రాజధానిగా చెప్పుకునే వరంగల్ పట్టణంలో కనిపించిన జల విలయం..రోడ్లు..కాల్వలను తలపిస్తుండగా..స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు..స్థానిక హంటర్ రోడ్ సంతోష్ మాత కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది… అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను కాపాడుకునేందుకు ఆమె కొడుకులు, కుటుంబ సభ్యులు చేసిన మానవ ప్రయత్నం అందరినీ కలచివేసింది…
మంచం మీద నుండి లెవలేని స్థితిలో ఉన్న స్వరూపరాణి అనే మహిళను నాలుగు చక్రాల తోపుడు బండిపై వేసుకొని వరదల్లో నుండి బయటకు తీసుకొచ్చి కాపాడుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు..ఈ ఘటన తెలిసిన వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పట్టణంలో ఇప్పటికీ 82 కాలనీలు జలదిగ్భంధంలోనే ఉన్నాయంటే..వరంగల్ లో వరద దుస్థితిని ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..ప్రస్తుతం ఈ ఘటన చూస్తే…పట్టణ ప్రగతి కళ్లకు కట్టినట్లు కనబడుతోందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: తోపుడు బండే అంబులెన్స్.. ఓరుగల్లు వరద కష్టాలు.. జలమయంలో 82 కాలనీలు(వీడియో)
Viral Video : వెంట్రుకవాసిలో చావునుంచి తప్పించుకున్నారు..!వీడియో చుస్తే అలానే ఉంది మరి..
Taliban: అఫ్గాన్ పౌరులకు ఎనలేని కష్టాలు.. తాలిబన్ల చెరలో విమానాలు..!విమానంలో అందరూ వాళ్ళే(వీడియో)
Technology Video: ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు.. ఎడారిలో మంచినీరు తయారుచేసే రోబో.. (వీడియో)