AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హద్దులు లేని ఆనందం.. బర్త్‌డే గిఫ్ట్‌కు ఎమోషనల్ అయిన ఆ కుర్రాడు .. రియల్‌ మీ సీఈవోనే కదిలించించిన వీడియో..

Watch Video: ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించిన గొప్ప బంధం మరోటి ఉండదని చెబుతుంటారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తన బిడ్డను మాత్రం క్షేమంగా, గొప్పగా చూసుకోవాలని..

Viral Video: హద్దులు లేని ఆనందం.. బర్త్‌డే గిఫ్ట్‌కు ఎమోషనల్ అయిన ఆ కుర్రాడు .. రియల్‌ మీ సీఈవోనే కదిలించించిన వీడియో..
Narender Vaitla
|

Updated on: Sep 09, 2021 | 11:35 AM

Share

Watch Video: ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించిన గొప్ప బంధం మరోటి ఉండదని చెబుతుంటారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తన బిడ్డను మాత్రం క్షేమంగా, గొప్పగా చూసుకోవాలని పరితపిస్తుంటుంది. అనారోగ్యంతో ఉన్నా, సమాజం తన బిడ్డపై చిన్నచూపు చూసిన తల్లి మాత్రం అమితమైన ప్రేమను కురిపిస్తూనే ఉంటుంది. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో తల్లి ప్రేమకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. మానసిక సమస్యతో (ఆటిజం) బాధపడుతోన్న ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కేక్‌ కట్ చేసే సమయంలో ఆ కుర్రాడి తల్లి అతనికి ఒక మొబైల్‌ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చింది.

ఈ సందర్భంగా ఎంతో ఆప్యాయంగా బిడ్డను దగ్గరి తీసుకొని తల్లి చూపించిన ప్రేమ అనిర్వచనీయమైంది. ఇక ఎలాంటి కల్మషం లేని మనసుతో ఉన్న ఆ చిన్నారి మొబైల్‌ ఫోన్‌ ఓపెన్‌ చేసే సమయంలో పలికిన హావభావాలు నెటిజన్లు ఎమోషన్‌కు గురి చేస్తున్నాయి. ఫోన్‌ చూడగానే అమాంతం ఆనందం వ్యక్తం చేసిన ఆ కుర్రాడు తల్లిని ప్రేమగా హత్తుకున్న వీడియో కంటతడి పెట్టిస్తోంది. ఇక వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగంతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ‘ఇది చూసి నా కళ్లలో నీళ్లు తిరిగితే.. మొహంపై సంతోషం వచ్చింది’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘అసలైన సంతోషం అంటే ఇదే’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

స్పందించిన రియల్‌ మీ సీఈఓ..

ఇక బర్త్‌డే గిఫ్ట్‌గా ఆ కుర్రాడికి తల్లి రియల్‌ మీ కంపెనీకి చెందిన ఫోన్‌ను బహుమతిగా ఇచ్చింది. ఇక ఈ వీడియో రియల్‌ మీ కంపెనీ సీఈఓ మాధవ్‌ శేత్‌ కంటపడింది. దీంతో ఈ వీడియోను రీ ట్వీట్‌ చేసిన ఆయన.. ‘రియల్‌ మీ టెక్నాలజీ ప్రజల్లో సంతోషాన్ని నింపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ కుర్రాడికి మా సంస్థ నుంచి వచ్చే కొత్త ప్రొడక్ట్‌ను నేను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఆ కుర్రాడి పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా మార్చేందుకు గాను ఈ బహుతిని ఇవ్వనున్నాను. రియల్‌ మీ ప్యాడ్‌ ఆ కుర్రాడికి ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌తో పాటు, ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తుందని ఆశిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే’ అని పేర్కొన్నారు.

Also Read:  Allu Arha: బుజ్జి గణపయ్యను తయారు చేసిన బన్నీ గారాలపట్టి.. అమ్మాయిగారి టాలెంట్ అదుర్స్ అంటున్న నెటిజన్లు..

Air India: ఇకపై హైదరాబాద్‌ టు లండన్‌ నాన్‌స్టాప్‌ విమానాలు.. కొత్త సర్వీసులు ప్రారంభించిన ఎయిర్‌ ఇండియా.

Dhoni-Kohli: ఆ విషయంలో కోహ్లీ కంటే ధోనినే బెటర్.. అందుకే టీమిండియాతో చేర్చారంటా..! అదేంటో తెలుసా?