Viral Video: సైక్లింగ్ చేస్తున్న యువతిపై దూకిన కంగారూ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..? వైరల్‌గా మారిన వీడియో

ఓ కంగారూ రోడ్డు దాటేందుకు వేగంగా పరుగెత్తుకు వస్తోంది. అయితే అదే సమయంలో రోడ్డుపై వేగంగా సైకిల్‌పై వెళ్తున్న ఓ అమ్మాయిపై దూకింది.

Viral Video: సైక్లింగ్ చేస్తున్న యువతిపై దూకిన కంగారూ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..? వైరల్‌గా మారిన వీడియో
kangaroo
Follow us
Venkata Chari

|

Updated on: Sep 09, 2021 | 9:45 AM

Viral Video: మానవుల తప్పిదంతో అడవులు నాశనం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో అవన్నీ కాంక్రీట్ జంగిల్‌లా మారాయి. మానవులు అడవులను నరకడం ఆపలేదు. అలాగే అందులో ఉండే జంతువుల గురించి కూడా ఆలోచించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో, జంతువులు తరచుగా ఊళ్లలోకి వస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తునే ఉన్నాం. అయితే ప్రస్తుతం నెట్టింట్ల వైరల్‌గా మారిన ఓ వీడియో కూడా ఇలాంటి సందర్భాన్ని తలపిస్తోంది. ఈ వీడియోను భారత అటవీ అధికారి సుశాంత్ నందా ఐఎఫ్ఎస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. దీంతో నెట్టింట్లో బాగా వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో కొంతమంది యువతులు సైక్లింగ్‌ చేస్తూ కనిపించారు. అయితే ఒక అమ్మాయి తన ముందున్న వారిని ఓడించి ముందుకు దూసుకపోతుంది. అయితే రోడ్డు మొత్తం‎ ఖాళీగా కనిపిస్తుడడంతో వేగం పెంచిన సదరు యువతిని షడన్‌గా రోడ్డపైకి వచ్చిన ఓ కంగారూ భయపెట్టేసేంది.

అడవిలో నుంచి ఉన్న రోడ్డు మార్గంలో వీరు సైక్లింగ్ చేస్తున్నారు. ఇంతలో షడన్‌గా రోడ్డు ఓ వైపు నుంచి మరోవైపునకు కంగారూ రోడ్డు దాటేందుకు వేగంగా పరుగెత్తుకొస్తుంది. సదరు యువతి, కంగారు ఒకేసారి రావడంతో.. కంగారూ వేగంగా ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి సైకిల్‌పై నుంచి కింద పడి అలానే ఉండిపోతుంది. ఇదంతా ఆమె వెనుకాల ఉన్న వారు వీడియోలో బంధించడంతో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

దీనిపై చాలమంది నెటిజన్లు తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ‘ఈ దారిలో మొదటి హక్కు జంతువులదే’ అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు రైడర్ కొంచెం జాగ్రత్తగా వెళ్తే బాగుండేదని రాసుకొచ్చారు.

Also Read:

Viral Video: తాబేళ్లు పరిగెత్తడం మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ వీడియో మీకోసమే.!

Viral Video: వీడెవడండి బాబోయ్‌.. భళ్లాల దేవుడికి అన్నలా ఉన్నాడు. ఎద్దు కొమ్ములను వంచేసి, ఆపై..