AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీడెవడండి బాబోయ్‌.. భళ్లాల దేవుడికి అన్నలా ఉన్నాడు. ఎద్దు కొమ్ములను వంచేసి, ఆపై..

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతీరోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో కొన్ని మనకు సమాచారాన్ని అందించేవి అయితే మరికొన్ని సంతోషాన్ని అందిస్తాయి. ఇక మరికొన్ని వీడియోలు...

Viral Video: వీడెవడండి బాబోయ్‌.. భళ్లాల దేవుడికి అన్నలా ఉన్నాడు. ఎద్దు కొమ్ములను వంచేసి, ఆపై..
Narender Vaitla
|

Updated on: Sep 08, 2021 | 7:18 PM

Share

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతీరోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో కొన్ని మనకు సమాచారాన్ని అందించేవి అయితే మరికొన్ని సంతోషాన్ని అందిస్తాయి. ఇక మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా మనకు ఎద్దులు కనిపిస్తే వాటి నుంచి దూరంగా వెళుతుంటాం. అవెక్కడ మనల్ని పొడిచేస్తాయో అని బిక్కుబిక్కుమంటూ నక్కి నక్కి వెళుతుంటాం. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా ఆ ఎద్దుతోనే పోటీకి దిగాడు.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ.. ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపైకి ఎక్కాడు. అక్కడ అతనికో ఎద్దు ఎదురుపడింది. ఏమైందో ఏమో ఒక్కసారిగా ఆ ఎద్దుతో పోటీకి దిగాడు. బాహుబలి సినిమాలో భళ్లాల దేవుడి పాత్రలో ఉన్న రానాలా ఎద్దు కొమ్ములను గట్టిగా పట్టుకొని దానిని ఒకవైపు వంచాడు. దీంతో కాసేపు ప్రతి ఘటించిన ఎద్దు ఒక్కసారిగా కింద పడిపోయింది.

దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వీడియో చూసిన కొందరు.. ‘వామ్మో ఈ వ్యక్తికి అస్సలు భయం లేనట్లుంది’, ‘ఇది ఎప్పుడూ చూడలేదు’ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరి సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: AP Corona: ఏపీలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. థర్డ్ వేవ్ తప్పదంటున్న నిపుణులు.. కొత్త కేసులు ఎన్నంటే..?

Pooja Hegde: మరో రెండు భారీ ఆఫర్లు కొట్టేసిన బుట్టబొమ్మ.. ఇద్దరు మెగా హీరోలతో నటించనున్న పూజా.?

Viral Video: రోడ్డుపై వెళుతోన్న వృద్ధుడిపై విరుచుకుపడ్డ హైనా.. ఒళ్లు గగుర్లు పొడిచే వీడియోను మీరూ చూడండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్