AP Corona: ఏపీలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. థర్డ్ వేవ్ తప్పదంటున్న నిపుణులు.. కొత్త కేసులు ఎన్నంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 1,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 15 మంది కొవిడ్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు.

AP Corona: ఏపీలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. థర్డ్ వేవ్ తప్పదంటున్న నిపుణులు.. కొత్త కేసులు ఎన్నంటే..?
Corona Virus
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 08, 2021 | 6:56 PM

AP Covid 19 Cases: భారత్‌లో కరోనా మహమ్మారి మరొసారి విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుతున్నాయి. ఎప్పటిలాగే సోమ, మంగళవారాల్లో కాస్త తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు.. బుధవారం మళ్లీ పెరిగాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.53లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 37,875 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్నిటి కేసులతో పోలిస్తే 21.03శాతం ఎక్కువ కావడం గమనార్హం. తాజా కేసులతో కలిసి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.30కోట్లు దాటింది. అటు కేరళలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. మూడో వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని సూచనలిచ్చింది..

ఇటు ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 1,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 15 మంది కొవిడ్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఏపీలో ప్రస్తుతం 14,510 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో 61,363 నమూనాలను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,70,99,014 మంది నుంచి సాంపిల్స్ సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపామన్నారు.

Ap Corona Cases Today

Ap Corona Cases Today

అయితే, ఇవాళ కొత్త నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 20,24,603కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 1,288 మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తంగా 19,96,143 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇక రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 13,950కు చేరుకుంది. మరోవైపు కీలక ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. తాజాగా సినిమా థియేటర్స్ ఓపెనింగ్స్ కి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. మరోవైపు, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ముందుగా ఉపాధ్యాయులకు టీకాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు..

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. నిన్న మరో 78.47లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 70.75కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. Read Also… Revanth Reddy: ప్రధాని మోడీ – సీఎం కేసీఆర్ మధ్య ఫెవికాల్ బంధం.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.