TS Corona: తెలంగాణలో కాస్త పెరిగిన కరోనా కేసులు.. పండుగ వేళ పదిలంగా ఉండాలంటున్న ప్రభుత్వం

తెలంగాణలో నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు కాస్త పెరిగినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 78,421 సాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 329 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

TS Corona: తెలంగాణలో కాస్త పెరిగిన కరోనా కేసులు.. పండుగ వేళ పదిలంగా ఉండాలంటున్న ప్రభుత్వం
Ts Corona
Follow us

|

Updated on: Sep 08, 2021 | 8:52 PM

Telangana Corona: తెలంగాణలో నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు కాస్త పెరిగినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 78,421 సాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 329 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని బుధవారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,60,471కు చేరుకుంది. కాగా, తాజాగా మరో 307 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 6,51,085 మంది కోలుకున్నారు.

ఇదిలావుంటే, కరోనా వైరస్‌ బారినపడి 24గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,889కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.57శాతం, మరణాల రేటు 0.58శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,497 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.

ఇక జిల్లాల వారీ కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…

Telangana Corona Cases Today

ఇదిలావుంటే, కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశాన్ని ఓ కుదుపు కుదేపేసింది. సెకండ్ వేవ్ తీవ్రత ఇప్పటికీ వెంటాడుతూనే వుంది. దేశంలో సెప్టెంబర్, అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రోజువారీ కేసులు 30 వేలకు తగ్గినప్పటికీ… మొదటి వేవ్‌లో రోజువారి నమోదైన కేసుల కన్నా.. ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. సెకండ్ వేవ్ పూర్తిగా ముగిసిందని చెప్పడానికి ఆధారాలేవన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. అందుకే రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు.

మరో రెండు రోజుల్లో వినాయక చవితి వస్తొంది. మండపాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వినాయకుడి నవరాత్రులు, నిమజ్జనం రోజున భక్తులు లక్షలాదీగా పాల్గొంటారు. ఇప్పటికే కరోనా రూల్స్ చాలా మంది పాటించడం లేదు. ఈ వినాయక ఉత్సవాల్లో.. కరోనా సూపర్ స్పెడ్ అయ్యే అవకాశలు ఎక్కువగా వున్నాయంటున్నారు. దీంతో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. మరోవైపు, వ్యాక్సినేషన్ ప్రక్రియను స్పీడప్ చేసింది సర్కార్.

Read Also… Visakha Land Scam: వంద కోట్ల విశాఖ భూ కుంభకోణంలో తొలి వికెట్.. అక్రమాలు నిర్ధారణ.. తహశీల్దార్‌ సస్పెన్షన్

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..