Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: మరో రెండు భారీ ఆఫర్లు కొట్టేసిన బుట్టబొమ్మ.. ఇద్దరు మెగా హీరోలతో నటించనున్న పూజా.?

Pooja Hegde: 'ఒకలైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార పూజాహెగ్డే. తొలిసినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. అనతికాలంలోనే...

Pooja Hegde: మరో రెండు భారీ ఆఫర్లు కొట్టేసిన బుట్టబొమ్మ.. ఇద్దరు మెగా హీరోలతో నటించనున్న పూజా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 08, 2021 | 6:49 PM

Pooja Hegde: ‘ఒకలైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార పూజాహెగ్డే. తొలిసినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. అనతికాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకున్న ఈ చిన్నది టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. ఓవైపు గ్లామర్‌ పాత్రల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రల్లో నటిస్తూ నెం1 రేసులో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా నటించేవన్ని భారీ చిత్రాలే కావడం విశేషం. పూజా ప్రస్తుతం ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్‌’ ‘బీస్ట్‌’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలన్నీ పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాలే.

ఇక ఈ సినిమాల తర్వాత మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో పూజా నటించే ఛాన్స్‌ కొట్టేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారికప ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే తాజాగా మరో రెండు భారీ ఆఫర్లను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హరీష్‌ శంకర్‌, పవన్‌ కళ్యాణ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో పూజాను హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ‘గద్దల కొండ గణేష్‌’ చిత్రంలో పూజా నటించిన విషయం తెలిసిందే. ఇక పూజా నటించనున్నట్లు వార్తలు వస్తోన్న మరో చిత్రం.. అల్లుఅర్జున్‌, శ్రీరామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనుందని సమాచారం. ఇదిలా ఉంటే పూజా ఇప్పటికే బన్నీతో రెండు సినిమాల్లో నటించింది. మరి ఈ మెగా ఆఫర్లకు సంబంధించిన వస్తోన్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముగిసిన రానా విచారణ.. కెల్విన్‌తో కలిపి 7 గంటల పాటు..

Golf Edge Residence: గోల్ఫ్‌ హెడ్జ్‌ రెసిడెన్సీ అక్రమాల అడ్డా.. నటుడు నరేష్‌ సంచలన వ్యాఖ్యలు..!

Bigg Boss 5: బిగ్‌బాస్‌ హౌజ్‌లో మొదలైన రొమాంటిక్‌ యాంగిల్‌.. వారిద్దరి మధ్య సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌ మొదలైందా.?