AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డుపై వెళుతోన్న వృద్ధుడిపై విరుచుకుపడ్డ హైనా.. ఒళ్లు గగుర్లు పొడిచే వీడియోను మీరూ చూడండి.

Viral Video: అడవిలో ఉండే జంతువులు జనావాసంలోకి రావడం ఇటీవల ఎక్కువైపోతోంది. అడవిలో వాటికి కావాల్సిన ఆహారం దొరకకపోవడమో, కాలుష్యం కారణంగా అడవి సాంధ్రత తగ్గడమో కారణం ఏదైనా అడవి...

Viral Video: రోడ్డుపై వెళుతోన్న వృద్ధుడిపై విరుచుకుపడ్డ హైనా.. ఒళ్లు గగుర్లు పొడిచే వీడియోను మీరూ చూడండి.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 08, 2021 | 6:25 PM

Viral Video: అడవిలో ఉండే జంతువులు జనావాసంలోకి రావడం ఇటీవల ఎక్కువైపోతోంది. అడవిలో వాటికి కావాల్సిన ఆహారం దొరకకపోవడమో, కాలుష్యం కారణంగా అడవి సాంధ్రత తగ్గడమో కారణం ఏదైనా అడవిలో ఉండాల్సిన జంతువులు రోడ్డు బాట పడుతున్నాయి. ఇక క్రూర మృగాలు మనుషులు ఉన్న చోటుకి వస్తే జరిగే ప్రమాదం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి దాడులకు సంబంధించిన వార్తలు ఇటీవల మనకు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణెలోనూ ఇలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పుణెలోని ఖేడ్‌ తహసీల్‌ ప్రాంతంలోని రోడ్డుపై ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ సమయంలోనే పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఓ హైనా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చేసింది. వచ్చీ రాగానే ఆ వృద్ధిడిపై ఒక్కసారిగా దాడి చేసింది. అమాంతం వృద్ధుడిని కరవడం ప్రారంభించింది. దీంతో అక్కడ ఉన్న ఓ యువకుడు చేతులో ఉన్న కర్ర సహాయంతో హైనాను చితకబాదాడు. మొదట్లో దెబ్బలను తట్టుకొని మరీ దాడి చేసిన హైనా.. చివరికి అక్కడి నుంచి పారిపోయింది.

దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు యువకులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. హైనా దాడి చేస్తోన్న సమయంలో దృశ్యాలు గగుర్లు పొడిచేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హైనా దాడి చేసిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని కొందరు నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు. మరి ఈ భయానక వీడియోను మీరూ చూసేయండి.

Also Read:  Viral Video: కింగ్ కోబ్రాను రక్షించబోయి షాక్ తిన్న యువకుడు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Assam Boat: బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీ.. 100 మంది ప్రయాణికులు గల్లంతు.. కొనసాగుతున్న సహాయకచర్యలు

Singer Sunitha: కుందనపు బొమ్మలా సునీత.. లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసిన సింగర్