AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam Boat: బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీ.. 100 మంది ప్రయాణికులు గల్లంతు.. కొనసాగుతున్న సహాయకచర్యలు

Assam Boats collision: అసోంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీకొట్టుకున్నాయి.

Assam Boat: బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీ.. 100 మంది ప్రయాణికులు గల్లంతు.. కొనసాగుతున్న సహాయకచర్యలు
Assam Two Boat Collided
Balaraju Goud
|

Updated on: Sep 08, 2021 | 9:16 PM

Share

Assam Two Boat Collided: అసోంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీకొట్టుకున్నాయి. జోర్హాట్‌ లోని నిమాతిఘాట్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ప‌డ‌వ‌ల్లో సుమారు 100 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో 50మంది దాకా గ‌ల్లంత‌య్యారు. 40 మందిని కాపాడారు. ఇంకా స‌హాయ‌క చ‌ర్యలు కొన‌సాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గల్లంతైనవాళ్లను రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బ్రహ్రపుత్ర నదిలో పడవలు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గల్లంతైన వాళ్లను కాపాడడానికి ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగం లోకి దిగాయి.

ఒక బోటు మ‌జులీ నుంచి నిమ‌తి ఘాట్‌కు వ‌స్తుండ‌గా, ఎదురుగా వచ్చిన మ‌రో బోటు ఢీకొట్టింది. దీంతో అందులోని ప్రయాణికులు నీటిలో మునిగిపోయారు. ప‌లువురు ఈత రాకపోవడంతో కొట్టుకు పోయారు. కొంద‌రు త‌మ ప్రాణాలు కాపాడుకొనేందుకు ప‌డ‌వ‌ల‌ను ప‌ట్టుకున్నారు. ఒడ్డుకు చేరేందుకు య‌త్నించారు. ఈ ఘ‌ట‌న అసోం రాజ‌ధాని గుహ‌వాటికి 350 కి.మీ దూరంలో జ‌రిగింది.ఈ దుర్ఘట‌న‌పై అసోం సీఎం హిమాంత బిశ్వా స్పందించారు. ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. NDRF & SDRF సహాయంతో రెస్క్యూ మిషన్ వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశంచారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించ‌డానికి సీఎం హిమాంత బిశ్వా ఘ‌ట‌నాస్థలాన్ని రేప‌టి లోపు సంద‌ర్శించే అవ‌కాశం ఉంది. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ సమీర్ కుమార్ సిన్హాను ఈ పరిణామాలను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.

ఈ ఘ‌ట‌న‌లో సుమారు 50 మందిపైగా గల్లంతైనట్లు స‌హాయ‌క బృందాలు భావిస్తున్నాయి. ఇప్పటికే 40 మంది ప్రయాణికులను సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చారు. 12 వ బెటాలియన్ నుండి 1 NDRF బృందం ఇప్పటికే స‌హాయ చ‌ర్యలు చేపడుతోంది. దోయిముఖ్ అరుణాచల్‌లో ఉన్న మరో 2 NDRF బృందాలు స‌హాయ‌క చ‌ర్యల్లో పాల్గొన‌న్నాయి.

ఈ ఘ‌ట‌న‌పై మాజీ అసోం సీఎం, ప్రస్తుత కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి, ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం చాలా దుర‌దృష్టక‌ర‌మ‌ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ స‌హాయం కావాల‌న్నా అందిస్తామ‌న్నారు. ప్ర‌జ‌లు ధైర్యంగా ఉండాల‌ని సూచించారు.

మరోవైపు, ప్రమాదంపై అసోం డిపార్ట్‌మెంట్ ఆప్ ఇన్ఫర్మేష‌న్ అండ్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ ప్రక‌ట‌న చేసింది ఎవ‌రైన త‌ప్పిపోయిన వారు, ఆచూకీ తెలియ‌ని వారు ఉంటే వారి స‌మాచారాన్ని డిస్టిక్ట్ ఎమెర్జెన్సీ ఆప‌రేష‌న్ సెంట‌ర్‌కు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబ‌ర్ ద్వారా స‌మాచారం అందించాల‌న్నారు. టోల్ ఫ్రీ నెంబ‌ర్ -1077 మొబైల్ నంబ‌ర్ – 7635961522

Read Also… Watch Video: సొరంగంలో విమానం నడిపాడు.. గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్నాడు. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.